న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆటనే కాదు.. మనసులూ గెలవండి'

Atal Bihari Vajpayee death reactions: Subcontinent has lost visionary political figure today, says Imran Khan

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి గొప్ప కవి, వక్తే కాదు.. క్రీడాభిమాని కూడా. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్‌ జట్టు 2004లో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్‌ బయల్దేరడానికి ముందు ప్రధానిని కలిసింది.

ఈ సందర్భంగా ఆయన 'ఆటనే కాదు. మనసులూ గెలవండి' అని స్వయంగా హిందీలో రాసిన సందేశంతో కూడిన బ్యాట్‌ను జట్టుకు బహూకరించి బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. చారిత్రాత్మక ఈ పర్యటనలో భారత్‌ టెస్టు సిరీస్‌ను 2-1తో, వన్డే సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది. గంగూలీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం చేసిన ఈ చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్‌పేయి కారణంగానే సాధ్యమైంది.

19 ఏండ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన అప్పటి బృందంలో సచిన్ టెండుల్కర్, రాహుల్‌ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్రసెహ్వాగ్, అనిల్ కూంబ్లే ఉన్నారు. మాజీ ప్రధాని.. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మృతితో క్రీడారంగంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

'వాజ్‌పేయీ గొప్ప నాయకుడు. ఫోఖ్రాన్‌ అనుపరీక్షలు సాధ్యమయ్యేలా చేసిన సాహసి. అందరికీ ఆదర్శప్రాయుడు. నీతిగల రాజకీయనాయకుడు. అన్ని పార్టీలూ ఆయనను గౌరవించాయి. వాజ్‌పేయీ మరణం తీరనిలోటు'

భారత్ ఓ అమూల్య వ్యక్తిని, అద్భుతమైన శక్తిని.. కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

'భారత్‌కు ఈరోజు తీరని నష్టం జరిగింది. ఈ దేశానికి వాజ్‌పేయీ చేసిన సేవలు అమూల్యం'

'భారత్‌ ఓ గొప్ప నాయకుణ్ని కోల్పోయింది. నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా'

'భారతదేశానికి ఇది అత్యంత విషాద దినం. వాజ్‌పేయీ గొప్ప నాయకుడు. ఈ దేశం అభ్యున్నతి కోసం ఆయన ఎంతో చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'

'ఎంతో అభిమానించే ప్రధాని. గొప్ప కవి, రాజనీతిజ్ఞుడు. మీరు లేకపోవడం దేశానికి తీరని లోటు'

బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, ఇషాంత్‌ శర్మ, రోహిత్‌ శర్మ కూడా అటల్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Story first published: Friday, August 17, 2018, 11:02 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X