న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్వల్ప మార్పు: టీమిండియా బస చేసేది అబుదాబి కాదు... దుబాయిలో

By Nageshwara Rao
Asia Cup 2018: Bcci Changes Staying Place For Cricket Team
Asia Cup 2018: Team India Hotel Shifts Base from Abu Dhabi to Dubai

హైదరాబాద్: ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా భారత్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆరంభమయ్యే ఆసియా కప్‌ బరిలో దిగనుంది.

క్రికెట్‌లోనే విచిత్రపు ఔట్: ఎలా ఔటయ్యాడో చూడండి (వీడియో)క్రికెట్‌లోనే విచిత్రపు ఔట్: ఎలా ఔటయ్యాడో చూడండి (వీడియో)

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుని సెలక్టర్లు ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆసియా కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు ఎక్కడ బస చేయాలి, ఎప్పుడు వెళ్లాలి అన్న దానిపై బీసీసీఐ మొత్తం షెడ్యూల్‌ను సిద్ధం‌ చేసింది. అయితే, ఈ షెడ్యూల్ ఇప్పడు చిన్నపాటి మార్పు చోట చేసుకుంది.

తొలుత బీసీసీఐ అధికారులు ఆటగాళ్లు బస చేసేందుకు అబుదాబిలోని ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌లో గదులు బుక్‌ చేశారు. భారత్‌తో పాటు టోర్నీలో పాల్గొనే మిగతా ఐదు దేశాలకు చెందిన ఆటగాళ్లు సైతం ఇదే హోటల్‌లో బస చేయనున్నారు. దీంతో భారత ఆటగాళ్లు బస చేసే హోటల్‌ను వేరొక చోటుకి మార్చారు.

క్రికెట్‌పై ఉన్న ప్రేమ విజయ్ మాల్యా చేత ఎంతపని చేయించిందిక్రికెట్‌పై ఉన్న ప్రేమ విజయ్ మాల్యా చేత ఎంతపని చేయించింది

దుబాయ్‌లోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో వీరి కోసం బీసీసీఐ అధికారులు తాజాగా రూమ్‌లు బుక్‌ చేశారు. అయితే, ఈ మార్పు వెనుక ఓ కారణం ఉంది. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా తన మొదటి రెండు మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. దీంతో ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ ఆరంభం కానుంది. టోర్నీలో భాగంగా టీమిండియా 18న హాంకాంగ్‌తో, 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌‌లను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించారు.

Story first published: Saturday, September 8, 2018, 16:41 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X