న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: ధోనితో షోయబ్ మాలిక్ కరచాలనం (వీడియో వైరల్)

Asia Cup 2018: MS Dhoni, Shoaib Malik share light moments during practice session in Dubai - Watch

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. వ్యూయర్‌షిఫ్ పరంగా కూడా ఈ మ్యాచ్ రికార్డులను నెలకొల్పుతుంది. అలాంటి మ్యాచ్ ఇరు జట్ల మధ్య మరోసారి దుబాయి వేదికగా జరగనుంది.

<strong>వన్డే వరల్డ్‌కప్: టికెట్ల కొనుగోలుకు ముగిసిన గడువు, ఒక్క టికెట్ మిగల్లేదు</strong>వన్డే వరల్డ్‌కప్: టికెట్ల కొనుగోలుకు ముగిసిన గడువు, ఒక్క టికెట్ మిగల్లేదు

ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇరు జట్లు సెప్టెంబర్ 19(బుధవారం) తలపడనున్నాయి. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయికి చేరుకున్నాయి. దుబాయికి చేరుకున్న వెంటనే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీప‌ర్ మహేంద్ర సింగ్ ధోనితో పాకిస్థాన్ వెటరన్ క్రికెట‌ర్ షోయబ్ మాలిక్ కరచాలనం చేశాడు. అంతేకాదు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.

హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో క్వాలిఫయిర్‌తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది. సెప్టెంబర్ 15(శనివారం) టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

<strong>ఆసియా కప్‌లో నమోదైన రికార్డులు: తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు</strong>ఆసియా కప్‌లో నమోదైన రికార్డులు: తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు

గత ఆసియా కప్ టోర్నీని తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.

ఆసియా కప్ టోర్నీ సంద‌ర్భంగా శుక్రవారం ఆరు దేశాల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ సెప్టెంబ‌ర్ 19వ తేదీన పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఆ మ్యాచ్‌పైనే అంద‌రి ఆస‌క్తి ఉంది. ఆ మ్యాచ్‌పై తామంతా ఫోక‌స్ చేసిన‌ట్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తెలిపాడు. పాకిస్థాన్‌తో ఆడ‌డం ఎప్పుడూ ఉత్సాహాన్ని క‌లిస్తుంద‌ని అన్నాడు. ఆసియా కప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి.. అతని స్థానంలో రోహిత్ శర్మకి సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఈ సిరీస్‌లో శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

భారత జట్టు:
రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్ ), కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ధోనీ( వికెట్ కీపర్ ), దినేష్ కార్తీక్, హర్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్, ఆక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బమ్రా , శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.

పాకిస్తాన్ జట్టు:
ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫ్రాజ్ అహ్మద్ ( కెప్టెన్/వికెట్ కీపర్ ), ఆసిఫ్ అలీ, హరిస్ సోహైల్, షాదాబ్ ఖాన్, ముహమ్మద్ నవాజ్, ఫహిమ్ అష్రఫ్, హసన్ ఆలీ, మహమ్మద్ అమిర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ షెన్వారీ, షాహీన్ అఫ్రిది

Story first published: Friday, September 14, 2018, 19:16 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X