న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మాజీ క్రికెటర్‌పై రాళ్ల దాడి.. తీవ్ర గాయాలు!!

Ashok Dinda attacked by miscreants in West Bengal while campaigning

కోల్‌కతా: టీమిండియా మాజీ పేసర్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్‌ దిండాపై ఈస్ట్‌ మిడ్నాపూర్‌లో ఓ దుండగుల గుంపు దాడికి పాల్పడింది. మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న దిండాపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్ళు రువ్వినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో దిండా తీవ్రంగా గాయపడ్డాడు.

37 ఏళ్ల అశోక్‌ దిండాపై తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని ఒకరినొకరు అడ్డుకుంటున్నారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. 2016 నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంగ్రామ్ కుమార్ డోలాయిపై దిండా పోటీ చేస్తున్నాడు.

గత నెలలోనే అశోక్ దిండా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతన్నట్లు తెలిపాడు. భారత్ తరఫున 13 వన్డేలు, 9 టీ20లు ఆడిన దిండా.. 12, 17 వికెట్లు తీశాడు. 2009లో శ్రీలంకపై నాగ్‌పూర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దిండా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే (1/34) ఆకట్టుకున్నాడు. సనత్ జయసూర్య అతని ఫస్ట్ ఇంటర్నేషనల్ వికెట్. ఇంగ్లండ్‌తో 2013లో జరిగిన వన్డే అతని కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. అందులో ఈ బెంగాల్ క్రికెటర్ (2/53) రాణించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆకట్టుకోలేకపోయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం దిండా అద్భుతంగా రాణించాడు. బెంగల్ తరఫున దశాబ్దకాలం ఆడిన అశోక్ దిండా.. 116 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 420 వికెట్ల పడగొట్టాడు. ఇందులో 26 సార్లు ఐదు వికెట్ల ఘనతను, 5 సార్లు 10 వికెట్ల హాల్స్ ‌అందుకున్నాడు. ఫలితంగా బెంగల్ తరఫు సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పుణే వారియర్స్, రైజింగ్ పుణే సూపర్ గేయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 78 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ క్రికెటర్ 68 వికెట్లు పడగొట్టాడు.

IPL 2021: ఆ జట్టు నన్ను తీసుకోలేకపోవడం ఎంతో బాధించింది: పుజారాIPL 2021: ఆ జట్టు నన్ను తీసుకోలేకపోవడం ఎంతో బాధించింది: పుజారా

Story first published: Wednesday, March 31, 2021, 10:52 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X