ఆ రోజే: క్రికెట్‌కు ఆశిష్‌ నెహ్రా వీడ్కోలు తేదీ ఖరారు

Posted By:

హైదరాబాద్: టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు తేదీ ఖరారైంది. న్యూజిలాండ్‌తో నవంబర్ 1వ తేదీన సొంత మైదానం న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు.

 కోచ్‌, కెప్టెన్‌‌తో చర్చించిన నెహ్రా

కోచ్‌, కెప్టెన్‌‌తో చర్చించిన నెహ్రా

ఈ విషయంపై ఇప్పటికే కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో చర్చించిన ఆశిష్ నెహ్రా బుధవారం టీమిండియా సభ్యులతో కూడా తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత టీమిండియాలోకి ఆశిష్ నెహ్రా పునరాగమనం చేశాడు.

 అందరినీ ఆశ్చర్యపరిచిన నెహ్రా రిటైర్మెంట్ ఆలోచన

అందరినీ ఆశ్చర్యపరిచిన నెహ్రా రిటైర్మెంట్ ఆలోచన

అయితే అనూహ్యంగా న్యూజిలాండ్ సిరిస్‌లో నెహ్రా రిటైర్మెంట్ ఆలోచన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశం లేకపోవడంతో నెహ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

 ఈ నిర్ణయం వెనుక అసలు కారణం

ఈ నిర్ణయం వెనుక అసలు కారణం

మరోవైపు యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉందన్న కారణంతోనే నెహ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో కూడా నెహ్రా పాల్గొనే అవకాశాలు అంతంతమాత్రమేనని అంటున్నారు. ‌

 1999లో అంతర్జాతీయ అరంగేట్రం

1999లో అంతర్జాతీయ అరంగేట్రం

1999లో మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Thursday, October 12, 2017, 9:52 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి