న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రతీ సిరీస్‌లో బుమ్రా రాణించాలంటే ఎలా? : మాజీ పేసర్

Jasprit Bumrah Facing Too Much Pressure - Ashish Nehra
Ashish Nehra Says Too much pressure on Jasprit Bumrah

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమైన జస్‌ప్రీత్ బుమ్రాకు కివీస్ కెప్టెన్ విలియమ్సన్, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం మద్దుతుగా నిలిచాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ప్రతీ సిరీస్‌లో బుమ్రా ఆడాలంటే ఎలా? అని ప్రశ్నించాడు.

'ప్రతీ సిరీస్‌లో బుమ్రా మీ అంచనాలను అందుకోవాలంటే ఎలా? అతను గాయం నుంచి కోలుకోని పునరాగమనం చేశాడనే విషయం గుర్తించాలి. ప్రతీసారి అద్భుతంగా రాణించాలంటే ఏ ఆటగాడికైనా కష్టమే. విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో విఫలమయ్యాడు.'అని నెహ్రా అభిప్రాయపడ్డాడు.

ఆ గొడవకు అభిమానులే కారణం : అండర్-19 క్రికెటర్ఆ గొడవకు అభిమానులే కారణం : అండర్-19 క్రికెటర్

మూడో పేసర్ బాధ్యత తీసుకోవాలి..

మూడో పేసర్ బాధ్యత తీసుకోవాలి..

భారత జట్టు పూర్తిగా బుమ్రా, మహ్మద్ షమీపై ఆధారపడుతోందని, టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే మూడో పేసర్ బాధ్యతలేంటో తెలియజేయాలన్నాడు. జట్టు ఎంపికలో కూడా స్థిరత్వం పాటించాలని సూచించాడు.

‘టీమ్‌మేనేజ్‌మెంట్ మంచి జట్టును ఎంపిక చేయాలి. బుమ్రా, షమీ కాకుండా ఇతర పేసర్లకు జట్టులో తమ పాత్ర ఏంటో తెలియాలి. గత రెండేళ్లుగా బుమ్రా, షమీ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక బుమ్రాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. జట్టు ఎంపికలో కొంచె స్థిరత్వం పాటించాలి'అని నెహ్రా సూచించాడు.

ఉమేశ్ కన్నా సైనీ బెటర్..

ఉమేశ్ కన్నా సైనీ బెటర్..

ఇషాంత్ శర్మ గాయం నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ కన్నా నవ్‌దీప్ సైనీ మంచి ఆప్షన్ అని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉమేశ్ యాదవ్ కన్నా జట్టుతో ఉన్న నవ్‌దీప్ సైనీని టెస్ట్‌లకు సిద్దం చేయడం బెటర్. కానీ అతను బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలవరీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాడు. అతని పేస్‌తో పాటు లెంగ్త్ అందుకుంటే సైనీ మరిన్నీ వికెట్లు తీయగలడు'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

గత 6వన్డేల్లో ఒక్క వికెటే..

గత 6వన్డేల్లో ఒక్క వికెటే..

ఇక చివరిగా ఆడిన ఆరు వన్డేల్లో కలిపి బుమ్రా కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. వరుసగా నాలుగు వన్డేల్లో వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జరిగిన చివరి వన్డేలో 10 ఓవర్లు వేసిన బుమ్రా 38 పరుగులిచ్చాడు.

గత ఏడాది చివర్లో వెన్ను గాయంతో మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. జనవరిలో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. పునరాగమనంలో బుమ్రా బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో గతంలోలా యార్కర్లని సంధించడంలో ఈ అగ్రశ్రేణి పేసర్ విఫలమవుతున్నాడు.

Story first published: Thursday, February 13, 2020, 19:35 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X