న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ దేశానికి రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి?: స్వామి నిత్యానందకు అశ్విన్ ట్వీట్

As Swami Nithyananda Declares ‘Own Nation,’ R Ashwin Queries About Its Visa

హైదరాబాద్: తనకు తాను దేవుడిని అని చెప్పుకుంటోన్న వివాదాస్పద గురువు నిత్యానంద ఇటీవలే ఒక దీవిని కొనుగోలు చేసి... దానికి జెండా, రాజ్యాంగం మరియు చిహ్నాన్ని రూపొందించినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ దీవిని రాజకీయేతర హిందూ దేశంగా గుర్తించాలని పేర్కొన్నాడు.

ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి అతడు విజ్ఞప్తి కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్వెడార్‌ సమీపంలోని ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి కైలాసం అనే పేరు పెట్టారు. ఈ విషయాలను Kailaasa.org అనే వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

కేవలం 11 మ్యాచ్‌లే.. టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్రణాళిక ఇదే?కేవలం 11 మ్యాచ్‌లే.. టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్రణాళిక ఇదే?

‘హిందూ సార్వభౌమ దేశంగా’ ప్రకటించిన నిత్యానంద

‘హిందూ సార్వభౌమ దేశంగా’ ప్రకటించిన నిత్యానంద

ఆ దేశానికి ప్రధాని, రాష్ట్రపతితో సహా ప్రత్యేక జెండా, జాతీయ చిహ్నం, పాస్‌ పోర్టులు కూడా ఉంటాయని అన్నారు. ‘హిందూ సార్వభౌమ దేశంగా' ప్రకటించినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ దేశానికి విరాళాలు ఇవ్వాలని దాని ద్వారా ‘కైలాసా' అనే "గొప్ప హిందూ దేశం" యొక్క పౌరసత్వం పొందే అవకాశాన్ని ఉందని తెలిపాడు.

ట్విట్టర్‌లో ఫన్నీగా స్పందించిన అశ్విన్

ఈ విషయం తెలిసిన భారత వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఫన్నీగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా స్వామి నిత్యానందకు తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. అశ్విన్ తన ట్విట్టర్‌లో "అక్కడికి రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి? లేదా వీసా ఆన్‌ అరైవల్‌ ఇస్తారా?" అంటూ కామెంట్ పెట్టాడు.

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్వామి నిత్యానంద

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్వామి నిత్యానంద

అశ్విన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, నిత్యానంద ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అహ్మాదాబాద్‌లోని తన ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థినులు అదృష్యమైన నేపథ్యంలో గుజరాత్‌ పోలీసులు నిత్యానందకు బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు.

Story first published: Thursday, December 5, 2019, 12:00 [IST]
Other articles published on Dec 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X