న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రహానే తప్ప, ఏ బ్యాట్స్‌మన్ నన్ను సలహా అడగడం లేదు'

By Nageshwara Rao
Apart from Rahane, no Indian batsman seeks my advice: Gavaskar

హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్‌లో ఒక్క రహానే తప్ప మిగతా క్రికెటర్లు ఎవరూ తన వద్దకు వచ్చి సలహాలు తీసుకోవడం లేదని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఆజ్‌తక్‌ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటనపై గవాస్కర్ స్పందించాడు.

ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ "అప్పట్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారు నా దగ్గరికొచ్చి సలహాలు తీసుకునేవారు. ఇప్పటి క్రికెటర్లలో ఆ ధ్యాసే లేదు. సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవాలన్న ఆలోచనే ఉండడం లేదు" అని వాపోయాడు.

రహానే ఒక్కడే

రహానే ఒక్కడే

"రహానే ఒక్కడే అప్పుడప్పుడు వచ్చి నా సలహాలు తీసుకుంటున్నాడు. అంతేకాదు నేను చెప్పే సలహాలను తూచ తప్పకుండా పాటిస్తున్నాడు" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

తొలి టెస్టులో టీమిండియా ఓటమి

తొలి టెస్టులో టీమిండియా ఓటమి

ఈ పర్యటనలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి టెస్టులో భారత బౌలర్లు రాణించినప్పటికీ, టాపార్డర్ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా ఓడిపోయింది.

లార్డ్స్ వేదికగా రెండో టెస్టు

లార్డ్స్ వేదికగా రెండో టెస్టు

మరోవైపు కెప్టెన్ కోహ్లీ తొలి టెస్టులో 200 పరుగులు చేసి అభిమానుల మనసులు గెలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ గతంలో విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు సచిన్, ద్రవిడ్ లక్ష్మణ్ వంటి వారు తరచూ తనకు ఫోన్ చేసి సలహాలు స్వీకరించేవారని పేర్కొన్నాడు.

ప్రస్తుత జనరేషన్‌లో అది కొరవడింది

ప్రస్తుత జనరేషన్‌లో అది కొరవడింది

కాగా, ప్రస్తుత జనరేషన్‌లో అది కొరవడిందని తెలిపాడు. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్‌లను నియమించుకుంటున్నారని గవాస్కర్ అన్నాడు. ఒక్క రహానే మాత్రం అప్పుడప్పుడు తన వద్దకు వచ్చి సలహాలు స్వీకరిస్తుంటాడని వివరించాడు. కోహ్లీ నాయకత్వంలోని జట్టు ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండానే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిందని గవాస్కర్ తెలిపాడు.

Story first published: Tuesday, August 7, 2018, 18:03 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X