
సక్సెస్ బాటలో ఉన్నప్పుడు
"మనం సక్సెస్ బాటలో ఉన్నప్పుడు జట్టుకు దూరంగా కావడం అనేక ప‍్రశ్నలకు తెరలేపుతోంది. మనం క్రికెట్‌ను ఆపేసిన సమయం వచ్చేసిందా? అనే అనుమానం కూడా కలుగుతుంది. 2019 ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడి నా ఆటతీరుని మెరుగుపర్చుకున్నా" అని రహానే అన్నాడు.

ఆ రెండు నెలల్లో ఏడు మ్యాచ్‌లు ఆడా
"వ్యక్తిగా కూడా ఎదిగా. ఆ రెండు నెలల్లో ఏడు మ్యాచ్‌లు ఆడా. ఆన్ ఫీల్డ్‌తో పాటు ఆఫ్ ఫీల్డ్‌లోనూ ఎంతో నేర్చుకున్నా. కొన్ని సార్లు పార్క్‌లో ఒంటరిగా జాగింగ్‌కు వెళ్తూ ఉంటా. కాఫీ తాగుతూ గత రోజులను గుర్తు చేసుకుంటాను. ప్రపంచ క్రికెట్‌లో అరంగ్రేటం చేయక ముందు క్లబ్ క్రికెట్ ఆడే రోజుల్లో నా మనస్తత్వం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటా. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది" అని రహానే తెలిపాడు.

చివరి సారిగా 2018 ఫిబ్రవరిలో
కాగా, 2018 ఫిబ్రవరిలో భారత్ తరఫున చివరి సారిగా వన్డేల్లో రహానే కనిపించాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఆ సిరీస్‌లో అతడు 35 సగటుతో 140 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో రహానే అత్యధిక వ్యక్తిగత స్కోరు 79 నాటౌట్. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. 2019 ప్రపంచకప్‌కు ఎంపికవ్వలేదు.

భారత్ తరుపున 90 వన్డేలు ఆడిన రహానే
భారత్ తరఫున ఇప్పటివరకు అతడు 63 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 4.112 పరుగులు, వన్డేల్లో 2,962 పరుగులు, టీ20ల్లో 375 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












