న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌: జులన్ గోస్వామిగా కోహ్లీ భార్య అనుష్క!

Anushka Sharma shoots with cricketer Jhulan Goswami: Is this her first film post Zero?

హైదరాబాద్: బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గతేడాదిగా ఒక్క ఒక్క సినిమాకు కూడా సంతకం చేయలేదు. ఆమె చివరిగా నటించిన చిత్రం 'జీరో' 2018 డిసెంబరులో విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో చిత్రాన్ని అంగీకరించలేదు.

తాజాగా, భారత మహిళా జట్టు పేసర్‌ జులన్‌ గోస్వామితో ఈడెన్ గార్డెన్స్‌లో అనుష్క శర్మ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో అనుష్క శర్మ టీమిండియా పాత నీలిరంగు జెర్సీ ధరించగా... ముదురు నీలం జీన్స్‌, స్పోర్ట్స్‌ జాకెట్‌ వేసుకున్న జులన్‌‌ చేయి చేయి కలిపి నవ్వుతున్నారు.

వికెట్లు ముందు 'షూ' ఉంచి మరి ప్రాక్టీస్.. ఆసీస్‌కు బూమ్రా హెచ్చరికలు!!వికెట్లు ముందు 'షూ' ఉంచి మరి ప్రాక్టీస్.. ఆసీస్‌కు బూమ్రా హెచ్చరికలు!!

దీంతో వీరిద్దరూ కలిసి ఓ అడ్వర్టైజ్మెంట్‌లో నటిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.... కాదు జులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో అనుష్క శర్మ ఆమె పాత్రను పోషిస్తున్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ షూటింగ్ సందర్భంగా సినిమా నిర్మాణ సిబ్బంది వారి వెనుక ఉన్నారు.

అయితే, బాలీవుడ్ హంగామాలో వచ్చిన వార్తల ప్రకారం జులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో అనుష్క శర్మ నటిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొంత భాగం పూర్తయిందని, మిగతా షెడ్యూల్‌ని జనవరి 25 నుంచి ప్రారంభించనున్నట్లు రాసుకొచ్చింది.

త్వరలో 100వ బర్త్‌డే: జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాడి ఇంటికి సచిన్, వాత్వరలో 100వ బర్త్‌డే: జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాడి ఇంటికి సచిన్, వా

గోస్వామి 2002వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో గోస్వామి ప్రయాణం మొదలైంది. ఆమె చిన్నతనం నుంచే మగపిల్లలతో ఆడి ఆమెలోని పేస్‌ను మెరుగుపరుచుకుంది. కోల్‌కతాలోని వివేకానంద పార్క్‌లో ఆమె శిక్షణాకాలం మెరుగుపరచుకుంది.

గోస్వామి తన కెరీర్‌లో 10 టెస్టులు, 169 వన్డేలు ఆడారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఎక్కువ వికెట్లు పడగొడుతున్న పేసర్ ఉందంటే అది గోస్వామినే. ఆమెకు వన్డేల్లో 200వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా కూడా పేరుంది. 2007లో ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకుంది. 2010లో అర్జున అవార్డుతో పాటు 2012లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.

Story first published: Tuesday, January 14, 2020, 13:18 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X