న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక ఉగ్రదాడి సమయంలో అక్కడే ఉన్నా: అనిల్ కుంబ్లే

Anil Kumble was on vacation in Sri Lanka terror attacks

హైదరాబాద్: గత వారంలో ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో మూడు వందలకుపైగా మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కుటుంబం తృటిలో తప్పించుకుంది.వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

శ్రీలంకలో ఉగ్రవాదులు ఉగ్రదాడి జరిపిన సమయంలో కొలంబోలోని షాంగ్రి లా హోటల్‌లోనే వీరు బస చేశారు. అయితే పేలుడు జరగడానికి కొన్ని గంటల ముందే వారు హోటల్‌ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని అనిల్ కుంబ్లేనే స్వయంగా వెల్లడించాడు.

కొలంబోలోని యాలా నేషనల్ పార్క్‌ను వీక్షించేందుకు గాను కుంబ్లే కుటుంబం ఉదయం 6 గంటల సమయంలో షాంగ్రి లా హోటల్‌‌ నుంచి బయల్దేరారు. అయితే, ఆ తర్వాత తొమ్మిది గంటల సమయంలో అదే హోటల్‌లో బాంబు పేలుడు జరిగినట్లు కుంబ్లేకు సమాచారం అందింది.

దీంతో లంక పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్‌కు తిరుగుపయనమైంది. ఇదిలా ఉంటే, శ్రీలంకలో ఈస్ట‌ర్ వేడుక‌ల స‌మ‌యంలో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌లో 253 మంది మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, April 27, 2019, 14:48 [IST]
Other articles published on Apr 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X