న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్: అసలు విషయం వెల్లడించిన కోచ్ కుంబ్లే!

Anil Kumble: Right time for KL Rahul to take over Kings XI captaincy

హైదరాబాద్: కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా రాణించేందుకు అన్ని రకాల సాయం అందించేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ఉందని పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఇటీవలే యాజమాన్యం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అయితే, కేఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుకున్న ప్రధాన కారణాన్ని హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే గురువారం పేర్కొన్నాడు. వచ్చే సీజన్‌లో భారత ఆటగాడిని కెప్టెన్‌గా తమ టీమ్‌ను కొనసాగించాలని భావించామని, అందుకే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని తెలిపాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2020 ఫైనల్ జరగనుందా?ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2020 ఫైనల్ జరగనుందా?

కుంబ్లే మాట్లాడుతూ "కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాం. ఈ పదవిని అతడు చేపట్టేందుకు సరైన సమయమిదే. కేఎల్ రాహుల్‌ని మించిన కెప్టెన్ మరోకరు జట్టులో కనిపించలేదు. అతడు టాలెంటెడ్ ప్లేయర్. ఈ మధ్య కాలంలో అతడి బ్యాటింగ్‌లో స్థిరత్వం వచ్చింది" అని అన్నాడు.

"వికెట్ కీపర్‌గాను జట్టుకు ఉపయోగపడగలడు. గత రెండేళ్ల ఆటతీరును పరిగణలోకి తీసుకుని అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాం. కెప్టెన్‌గా రాహుల్ రాణించేందుకు అన్ని రకాల సాయమందించేందుకు జట్టు మేనేజ్‌మెంట్ సిద్దంగా ఉంది" అని హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు.

ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్.. ఈ దశాబ్దపు ఐదో బౌలర్‌గా అండర్సన్‌ రికార్డు!!ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్.. ఈ దశాబ్దపు ఐదో బౌలర్‌గా అండర్సన్‌ రికార్డు!!

గత సీజన్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ట్రేడింగ్‌ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. దీంతో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. దీంతో గత రెండు సీజన్లలో పంజాబ్ జట్టు తరుపున నిలకడగా రాణిస్తోన్న కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు కుంబ్లే వ్యాఖ్యానించాడు.

Story first published: Thursday, December 26, 2019, 19:16 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X