న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను తబలా వాయించడానికి ఇక్కడ లేను: పంత్‌పై వస్తోన్న విమర్శలకు ధీటుగా బదులు

Am I there only to play tabla? Ravi Shastri defends pulling up Rishabh Pant

హైదరాబాద్: భారత జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన సరిగా లేనప్పుడు వారిని మెరుగుపరచడం కోసమే తానిక్కడ ఉన్నానంటూ విమర్శలకు తనదైన శైలిలో బదులిచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తోన్న నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి కాస్త ఘాటుగానే స్పందించాడు.

తాను టీమిండియా హెడ్ కోచ్‌ బాధ్యతలు తీసుకున్నది తబలా వాయించడానికా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించాడు. రిషబ్ పంత్ గాడిలో పడే వరకు అతడికి జట్టు మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలుస్తుందని తెలిపాడు. శాస్త్రి మాట్లాడుతూ "టీమ్ మేనేజ్‌మెంట్ అని చెప్పకండి. ఆటగాళ్లు ఒకే తరహా తప్పులు చేస్తూ పెవిలియన్‌ బాట పడితే వాటిని చక్కదిద్దడానికే నేను ఇక్కడ ఉన్నా" అని అన్నాడు.

ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని జట్టుని వేడుకున్నా: సచిన్ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని జట్టుని వేడుకున్నా: సచిన్

నేను తబలా వాయించడానికి ఇక్కడ లేను

నేను తబలా వాయించడానికి ఇక్కడ లేను

"నేను తబలా వాయించడానికి ఇక్కడ లేను. అతనొక వరల్డ్‌క్లాస్‌ ఆటగాడు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించే సత్తా పంత్‌లో ఉంది. మనం సంయమనంతో ఉంటే అతని అత్యుత్తమం బయటకొస్తుంది. ప్రపంచ క్రికెట్‌లో కొద్దిమంది మాత్రమే ఇలా ఉన్నారు. వైట్ బాల్ లేదా టీ20 క్రికెట్ విషయానికి వస్తే నా చేతులతో ఐదుగురిని ఎంచుకోలేను. కాబట్టి అతడి విషయంలో సహనం అవసరం" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

రిషబ్ పంత్‌ ఒక ఆయుధమని మీడియా రాస్తుంది

రిషబ్ పంత్‌ ఒక ఆయుధమని మీడియా రాస్తుంది

"ప్రస్తుత భారత్‌ క్రికెట్‌‌కు రిషబ్ పంత్‌ ఒక ఆయుధమని మీడియా రాస్తుంది. నిపుణులు వారి పనిని వారు సమర్ధంగా నిర్వహిస్తున్నారు. వారు మాట్లాడతారు. రిషబ్ పంత్‌ ఒక ప్రత్యేకమైన కుర్రాడు. ఇంకా నేర్చుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతనికి అండగా ఉంది. అతను కచ్చితంగా గాడిలో పడతాడు" అని రవిశాస్త్రి తనదైన శైలిలో తెలిపాడు.

గంభీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రవిశాస్త్రి

గంభీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రవిశాస్త్రి

ఇటీవల పేలవ ప్రదర్శన చేస్తోన్న పంత్‌కు రవిశాస్త్రి, జట్టు మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తుందంటూ గౌతం గంభీర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గంభీర్ విమర్శల నేపథ్యంలో రవిశాస్త్రి కాస్త ఘాటుగా బదులిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం రిషబ్ పంత్‌కు మద్దుతగా నిలిచాడు.

పంత్‌కు యువీ మద్ధతు

పంత్‌కు యువీ మద్ధతు

ధోనీ కూడా ఒక్కరోజులో అవకాశాలు ఒడిసిపట్టుకోలేదని, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కాస్త సమయం పడుతుందని అన్నాడు. యువీ మాట్లాడుతూ "అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనీ కూడా ఒక రోజులో అవకాశాలు అందిపుచ్చుకోలేదు. అతనికి కొన్నిఏళ్లు పట్టింది. ధోనీ భర్తీకి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా ఒక సంవత్సరం ఉంది. పంత్‌పై విమర్శలు ఆపండి. ధోనితో పోల్చుతూ పంత్‌పై ఒత్తిడి తెస్తున్నారు" అని అన్నాడు.

Story first published: Thursday, September 26, 2019, 13:40 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X