న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ కూడా బాక్సింగ్ లాంటిదే: బౌలింగ్ కోచ్ అరుణ్

Bharathi Arun opens up about

హైదరాబాద్: క్రికెట్‌ కూడా బాక్సింగ్‌లాంటిదేనని అంటున్నాడు టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భారతి అరుణ్. ఓడిపోతామని భయపడితే.. గెలవలేమని అంటున్నాడు. ''క్రికెట్‌ కూడా బాక్సింగ్‌ లాంటిదే. గాయపడతామేమోనన్న భయంతో రింగ్‌లో దిగకుండా ఉంటే మనం ఎప్పుడూ గెలవలేం. ఈ జట్టుకు ఓటమి భయం లేదు. విజయం గురించి మాత్రమే ఆలోచిస్తుంది'' అని చెప్పాడు.

2019 ప్రపంచకప్‌ నేపథ్యంలో తదుపరి లక్ష్యం ప్రతిభావంతులైన బ్యాకప్‌ పేసర్లను సిద్ధం చేయడమేనని అరుణ్‌ అన్నాడు. వన్డే క్రికెట్‌కు సంబంధించి భువనేశ్వర్‌, బుమ్రాల రూపంలో ఇప్పటికే ప్రధాన పేసర్లున్నారు. ఐతే అరుణ్‌తోపాటు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కనీసం మరో ముగ్గురు సహాయ పేసర్లు సిద్దంగా ఉండాలని కోరుకుంటున్నారు. శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌ రిజర్వ్‌ పేసర్లను పరీక్షించడానికి ఉపయోగపడుతుందని భరత్‌ అరుణ్‌ అభిప్రాయపడ్డాడు.

బౌలర్ సిరాజ్ తహతహలాడుతూ:

బౌలర్ సిరాజ్ తహతహలాడుతూ:

‘మా రిజర్వ్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగం సమర్థతను పరిశీలించేందుకు శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్‌ చక్కటి వేదిక. ఇప్పటికే భువీ, బుమ్రాల రూపంలో ఇద్దరు ప్రపంచస్థాయి బౌలర్లు జట్టులో ఉన్నారు. ఇక శ్రీలంక వెళ్లనున్న మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉన్‌దక్త్ అక్కడ సత్తా చాటాలని తహతహలాడుతున్నారు' అని అరుణ్‌ చెప్పాడు.

దేవధర్‌ ట్రోఫీలో ఆడబోతూ:

దేవధర్‌ ట్రోఫీలో ఆడబోతూ:

‘‘చాలా సుదీర్ఘ సీజన్‌ ముందుంది. గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలకు సిద్ధంగా ఉండాలి. శార్దుల్‌ దక్షిణాఫ్రికాలో చక్కగా రాణించాడు. షమి, ఉమేశ్‌ కూడా పోటీలో గట్టిగా ఉన్నారు. వాళ్లు దేవధర్‌ ట్రోఫీలో ఆడబోతున్నారు'' అని చెప్పాడు. ప్రస్తుత బౌలర్లలో చాలా మంది జూనియర్లుగా జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందినవారే. ఎన్‌సీఏ మాజీ కోచ్‌ అయిన అరుణ్‌ వాళ్లను చాలా దగ్గరగా పరిశీలించాడు.

విజయవంతమైన ఉనద్కత్‌

విజయవంతమైన ఉనద్కత్‌

ఈ నేపథ్యంలోనే టీ20 ఫార్మాట్లో విజయవంతమైన ఉనద్కత్‌.. వన్డేల్లోనూ రాణించి, మంచి ఎడమచేతి వాటం ప్రత్యామ్నాయం కాగలడా అని అడిగినప్పుడు.. ‘‘నేను సెలక్టర్‌ కానందున ఉనద్కత్‌ వన్డే ప్రణాళికల్లో ఉండాలా లేదా అన్నదానిపై నేను మాట్లాడను. కానీ ఒక కోచ్‌గా ప్రతి బౌలర్‌ కూడా విజయవంతం కాగలడనే నమ్మకంతో నేను ఉండాలి. అన్వయించుకోవడం చాలా ముఖ్యం. ఉనద్కత్‌ బాగా అన్వయించుకోగలిగితే అతడు వన్డేల్లో రాణించలేడనడానికి కారణం కనిపించట్లేదు'' అని అరుణ్‌ చెప్పాడు.

గుజరాత్‌ బౌలర్‌ బుమ్రా:

గుజరాత్‌ బౌలర్‌ బుమ్రా:

‘టీ20లు, వన్డేలకు అనుగుణంగా బౌలింగ్‌ చేయగలగడమే ప్రధానం. అయితే విభిన్న ఫార్మాట్లకు అలవాటు పడడమనేది ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. జయదేవ్‌ కనుక అలా అలవాటు పడితే వన్డే జట్టులో అతడికి చోటెందుకు ఉండదు' అని ప్రశ్నించాడు. టీ20ల స్పెషలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి క్రమంగా వన్డేలు, టెస్ట్‌ల స్థాయికి ఎదిగాడు గుజరాత్‌ బౌలర్‌ బుమ్రా. ఇలా మూడు విభాగాల్లోనూ అతడు విజయవంతం అవుతాడనడంలో తనకు ఎలాంటి సందేహాలు కలగలేదని అరుణ్‌ స్పష్టం చేశాడు. ‘బుమ్రా సత్తాపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. ఏ ఫార్మాట్‌లోనైనా ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా కొత్త, పాత బంతులతో ఇబ్బందులుపెట్టడం అతడి సమర్థతకు నిదర్శనం' అని తెలిపాడు.

Story first published: Friday, March 2, 2018, 13:45 [IST]
Other articles published on Mar 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X