|
ఓవల్ టెస్టే కుక్ కెరీర్‌లో ఆఖరి మ్యాచ్
కుక్ సోమవారం ప్రకటించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 7(శుక్రవారం) నుంచి భారత్‌తో మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ అని కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 33 ఏళ్ల కుక్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాడు.
|
టెస్టుల్లో అనేక రికార్డులు కుక్ సొంతం
ఇంగ్లాండ్ జట్టు తరుపున కుక్ అనేక రికార్డులను నమోదు చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో కుక్ యావరేది 44.88గా ఉంది. 2016లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి చిన్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు.
|
అత్యంత పిన్న వయస్కుడిగా కుక్ రికార్డు
టెస్టు క్రికెట్ చరిత్రలో 6వేలు, 7వేలు, 8వేలు, 9వేలు, 10వేలు, 11వేలు, 12 వేల పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కుక్ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ జట్టుకు 59 టెస్టుల్లో కెప్టెన్సీ కూడా వహించాడు. 2013, 2015 యాషెస్ సిరీస్‌లు గెలవడం అలెస్టర్ కుక్ జీవితంలో మరిచిపోలేని సిరిస్‌లు. ఇండియా, దక్షిణాఫ్రికాల్లో సిరీస్ విజయాలు సాధించిన ఘనత కూడా అలెస్టర్ కుక్ సొంతం.
|
అలెస్టర్ కుక్ రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అలెస్టర్ కుక్ రికార్డులు:
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు: 12254
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు: 32
ఇంగ్లండ్ తరఫున అత్యధిక 150+ స్కోర్లు : 11
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు : 160
విరామం లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ : 158 టెస్టులు
ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టులు: 59

కుక్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవన్ జట్టు ఇదే...:
గ్రాహం గూచ్ (కెప్టెన్), మాథ్యూ హేడెన్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, ఏబీ డివిల్లీర్స్ (వికెట్ కీపర్), కుమార సంగక్కర (వికెట్ కీపర్), జాక్ కలిస్, ముత్తయ్య మురళీధరన్, షేన్‌వార్న్, జేమ్స్ ఆండర్సన్, గ్లెన్ మెక్‌గ్రాత్.