న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రహానే వీడియో వైరల్: ఫ్యామిలీ టైమ్ ఓవర్, ఇక ఇప్పుడు ప్రాక్టీస్ టైమ్

India vs Bangladesh 2019: Ajinkya Rahane Resumes Training For The Bangladesh Series ! || Oneindia
Ajinkya Rahane Resumes Training After Spending Quality Time With Family. Watch Video

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్ అనంతరం కొంత విరామం లభించడంతో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన రహానే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

ఈ మేరకు ట్రైనింగ్‌కు హాజరైన వీడియోని రహానే తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "కుటుంబ సభ్యులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడిపిన తర్వాత తిరిగి ఆఫీసుకు వచ్చేందుకు సమయం ఆసన్నమైంది" అనే కామెంట్‌తో మైదానంలో పరుగెత్తుతున్న వీడియోని రహానే తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

భారత్ నుంచి ఇద్దరు: ప్రపంచ క్రికెట్‌లో పుట్టినరోజున సెంచరీలు సాధించిన క్రికెటర్లు వీరే!భారత్ నుంచి ఇద్దరు: ప్రపంచ క్రికెట్‌లో పుట్టినరోజున సెంచరీలు సాధించిన క్రికెటర్లు వీరే!

కాగా, ఇటీవలే రహానే భార్య రాధికా ధోపావ్‌కర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడుతున్న నేపథ్యంలో రహానే కూతురు పుట్టిన విషయం తెలిసినప్పటికీ వెంటనే అక్కడికి వెళ్లలేకపోయాడు. తొలి టెస్టు ముగిసిన తర్వాత రహానే తన కూతురి చూడటానికి వెళ్ళాడు.

తన కూతురిని చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు. భార్యతో కలిసి చిన్నారిని తనవి తీరా చూస్తున్న ఫోటోను రహానే తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. హానే ట్వీట్ చూసిన క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌, రహానే దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. 'రాధిక, రహానే మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ ఆనందంతో ఏదీ సరితూగదు. ఆ ఆనందంలో మునిగితేలండి. డైపర్లు మారుస్తూ నైట్‌వాచ్‌మెన్‌గా కొత్త అవతారాన్ని ఎంజాయ్‌ చెయ్ రహానే' అని సచిన్ పేర్కొన్నాడు.

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం రహానేకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికకు, చిన్న రాణికి కూడా కంగ్రాట్స్‌. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా. రహానే.. ఇప్పుడు జీవితంలో సరదా పార్ట్‌ మొదలైంది' అని హర్భజన్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే 216 పరుగులతో ఫరవాలేదనిపించాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో రహానే సెంచరీని సాధించాడు. టెస్టుల్లో రహానేకు ఇది 11వ సెంచరీ కావడం విశేషం.

India vs Bangladesh: బంగ్లా బోర్డుతో వివాదం.. భారత పర్యటనకు షకీబ్‌ దూరం?!!India vs Bangladesh: బంగ్లా బోర్డుతో వివాదం.. భారత పర్యటనకు షకీబ్‌ దూరం?!!

గత మూడేళ్లలో సొంతగడ్డపై రహానేకు ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. చివరగా సొంతగడ్డపై 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లోనే రహానే సెంచరీ సాధించడం విశేషం. రాంచీ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో దక్షిణాఫ్రికాపై 3-0తో టెస్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. అంతేకాకదు టెస్టుల్లో టీమిండియాకు ఇది వరుసగా 11వ టెస్టు సిరిస్ విజయం కావడం విశేషం. ప్రస్తుతం టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

Story first published: Tuesday, October 29, 2019, 12:54 [IST]
Other articles published on Oct 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X