న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ పక్కన పెట్టుకుని నిద్రించిన రహానే: ఆట పట్టించిన కోహ్లీ, ధావన్

IND vs BAN,2nd Test : Virat Kohli, Shikhar Dhawan Troll Ajinkya Rahane For His Pink Ball Dream
Ajinkya Rahane dreams about pink-ball Test, gets hilarious response from Virat Kohli and Shikhar Dhawan

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే డే/నైట్ టెస్ట్ గురించి సోమవారం రాత్రి కలలు కంటున్న ఓ ఫోటోని భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, సహచర ఆటగాడు శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి 26 వరకు జరగనున్న చారిత్రాత్మక డే/నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ప్లడ్ లైట్ల వెలుగులో ఇరు జట్లు తొలిసారి డే/నైట్ మ్యాచ్‌ని ఆడుతుండటంతో ఈ టెస్టుకు ప్రత్యేకత సంతరించుకుంది.

పింక్ బాల్‌ను పక్కనే పెట్టుకుని

పింక్ బాల్‌ను పక్కనే పెట్టుకుని

ఇందులో భాగంగా రహానే తన ఇనిస్టాగ్రామ్‌లో పింక్ బాల్‌ను పక్కనే పెట్టుకుని నిద్రిస్తోన్న ఫోటోను పోస్టు చేస్తూ "ఇప్పటికే చారిత్రాత్మక పింక్ బాల్ టెస్ట్ గురించి కలలు కన్నా" అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ తమదైన శైలిలో స్పందించారు.

కోహ్లీ కామెంట్

విరాట్ కోహ్లీ "బాగుంది జింక్సీ" అని ఫోటో కింద కామెంట్ పెట్టగా... శిఖర్ ధావన్ "Sapney mein pic khich gayi" అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఈ డే/నైట్ టెస్టు కోసం ఎదురు చూస్తోన్నారు.

తొలుత కోహ్లీ, రహానే

తొలుత కోహ్లీ, రహానే

జట్టులోని మిగతా సహచర క్రికెటర్ల కంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజ్యింకె రహానేలు ముందుగానే మంగళవారం కోల్‌కతాకు చేరుకున్నారు. పిచ్‌ను పరిశీలించడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శిస్తాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు.

బుధవారం తెల్లవారుజామున కోల్‌కతాకు రోహిత్ శర్మ

బుధవారం తెల్లవారుజామున కోల్‌కతాకు రోహిత్ శర్మ

రోహిత్ శర్మ బుధవారం తెల్లవారుజామున 1.55 గంటలకు కోల్‌కతాలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ అదే రోజు ఉదయం 9.35 గంటలకు కోల్‌కతాకు చేరుకుంటారు. ఇషాంత్ శర్మ మంగళవారం రాత్రి 10.45 గంటలకు చేరుకుంటారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మిగతా జట్టు కోల్‌కతాకు వస్తుందని భావిస్తున్నారు.

పచ్చికతో ఈడెన్ పిచ్

పచ్చికతో ఈడెన్ పిచ్

కాగా, ఈడెన్ పిచ్ పచ్చికతో కూడుకుని ఉందని భావిస్తున్నారు. ఇది టీమిండియా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. సోమవారం వరకు కూడా ఈడెన్ పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ మాట్లాడుతూ "శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికి ముందు పిచ్‌పై ఎలాంటి పింక్ బాల్ టెస్టింగ్ ఉండదు" అని తేల్చి చెప్పారు.

Story first published: Tuesday, November 19, 2019, 13:20 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X