న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్ఘాన్‌తో ఏకైక టెస్ట్‌, డే 1 హైలెట్స్: ఐర్లాండ్‌ 172 ఆలౌట్‌

Afghanistan Vs Ireland, Only Test, Day 1 Highlights: Afghans on top after Irish collapse

హైదరాబాద్: అఫ్ఘానిస్థాన్‌తో శుక్రవారం మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ తడబడింది. టాపార్డర్‌తో మిడిలార్డర్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. అయితే, ఐర్లాండ్ జట్టులో 11వ ఆటగాడు టిమ్ జేమ్స్‌ ముర్తాగ్ (75 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు పోర్టర్‌ఫీల్డ్ (9), పాల్ స్టిర్లింగ్ (26) తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఆరు బంతుల తేడాలో ఈ ఇద్దరు ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాల్‌బిర్ని (4), మెకోల్లమ్ (4), ఒబ్రియాన్ (12), పోయింటర్ (0), థాంప్సన్ (3) వరుస విరామాల్లో పెవిలియన్‌కు చేరారు.

ఐపీఎల్ 2019: చెన్నై జట్టుకు యోయో టెస్టు లేదు, మరి ఫిట్‌నెస్!ఐపీఎల్ 2019: చెన్నై జట్టుకు యోయో టెస్టు లేదు, మరి ఫిట్‌నెస్!

దీంతో ఐర్లాండ్ జట్టు 62 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాక్రిల్ (39) కాసేపు పోరాడాడు. అయితే 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముర్తాగ్.. డాక్రిల్‌కు అండగా నిలిచి ఆఫ్ఘన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరూ కలిసి పదో వికెట్‌కు 87 పరుగులు జోడించారు.

ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో మహ్మద్‌ నబీ, యమిన్‌ అహ్మద్జాయ్‌ చెరో మూడు వికెట్లు తీయగా రషీద్‌ ఖాన్‌, వకార్‌ సలామ్‌ ఖైల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ జట్టులో మహ్మద్‌ షెహజాద్‌ (40) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 31వ ఓవర్లలో 2 వికెట్లకు 90 పరుగులు చేసింది.

రహమత్ షా (22 బ్యాటింగ్), హష్మతుల్లా (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు 82 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Saturday, March 16, 2019, 10:50 [IST]
Other articles published on Mar 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X