న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: గాయపడిన ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్.. తర్వాతి మ్యాచ్‍కు డౌటే..

 Afghanistan bowler Rashid Khan. He got injured while fielding in the match against Sri Lanka.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బ్రిస్బేన్‌లో మంగళవారం జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో మహ్మద్ నబీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు తప్పక గెలవాల్సిన గేమ్ లో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. ఆఫ్ఘాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ తన జట్టుకు విజయం కోసం ప్రయత్నించాడు. బ్యాటింగ్ లో 8 బంతుల్లో 9 పరుగులు చేశాడు. బౌలింగ్ లో నాలుగు ఓవర్లలో 31 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు.

ధనంజయ డి సిల్వా

అయితే రషీద్ ఖాన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ధనంజయ డి సిల్వా ఆడిన చివరి ఓవర్‌లోని మొదటి బంతి మిడ్-ఆన్ ఫీల్డర్‌ మీదుగా వెళ్లింది. డీప్ మిడ్ వికెట్ వద్ద నిలిచిన రషీద్ ఖాన్ తన ఎడమవైపుకు పరిగెత్తాడు. బౌండరీని ఆపడానికి అతని కుడి మోకాలి మీదుగా డైవ్ చేశాడు. దీంతో అతను గాయపడ్డాడు.ఫిజియో కాసేపు థెరపీ చేసినా నొప్పు ఉండడంతో అతడిని మైదానం నుంచి బయటకు వెళ్లాడు.

ధనంజయ డి సిల్వా

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ల లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ 24 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధనుంజయ డిసిల్వా 42 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుసల్ మెండిస్ 25 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 19, రాజపక్స 18 పరుగులు చేశాడు.

ఆ రెండు

గ్రూప్-1 నుంచి అఫ్ఘానిస్తాన్ తో పాటు ఐర్లాండ్ కూడా సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్లే.. సెమీస్ కోసం ప్రధానంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. నవంబర్ 4న న్యూజిలాండ్ ఐర్లాండ్ తో తలపడనుండగా.. ఆస్ట్రేలియా ఆఫ్ఘానిస్తాన్ తో పోటీ పడనుంది. ఇంగ్లాండ్ శ్రీలంకతో పోటీ పడనుంది. ఈ మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ గెలిస్తే రన్ రేట్ ఆధారంగా రెండు టీమ్ లు సెమీస్ కు వెళ్లనున్నాయి.

Story first published: Wednesday, November 2, 2022, 9:08 [IST]
Other articles published on Nov 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X