న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లీష్‌ కౌంటీ.. అరంగేట్రంలోనే సత్తా చాటిన డివిలియర్స్

AB de Villiers blazes 88 on T20 Blast debut as Middlesex cruise to victory at Lords

లండన్‌లోని ఇంగ్లీష్‌ కౌంటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో దక్షిణాఫ్రికా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ అదరగొట్టాడు. మిడిల్‌ఎసెక్స్‌ తరఫున ఆడుతున్న డివిలియర్స్‌ 88 (43 బంతుల్లో; 5 ఫోర్లు, 6 సిక్సులు) పరుగులు చేసి అరంగేట్రంలోనే ఇంగ్లీష్‌ కౌంటీల్లో తన సత్తా చాటాడు. లక్ష్య ఛేదనలో డివిలియర్స్‌ విజృంభించడంతో మిడిల్‌ఎసెక్స్‌ జట్టు.. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

బెన్ స్టోక్స్‌కు కీలక అవార్డు ఇవ్వ‌నున్న న్యూజిలాండ్!!బెన్ స్టోక్స్‌కు కీలక అవార్డు ఇవ్వ‌నున్న న్యూజిలాండ్!!

లక్ష్య ఛేదనలో మిడిల్‌ఎసెక్స్‌ జట్టుకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ పాల్ స్ట్రిర్లింగ్ (10), నిక్ గుబ్బిన్స్ (12)లు త్వరగానే పెవిలియన్ చేరారు. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఏబీ డివిలియర్స్‌, డేవిడ్ మలాన్ ఆదుకున్నారు. ఇద్దరు క్రీజులో కుదురుకుని బౌండరీల మోత మోగించారు. ఈ జోడి వేగంగా ఆడుతూ.. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో మిడిల్‌ఎసెక్స్‌ విజయం దిశగా దూసుకెళ్లింది.

మలాన్ పెవిలియన్ చేరినా.. జాన్ సింప్సన్‌తో కలిసి డివిలియర్స్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. డివిలియర్స్‌ విరుచుకుపడడంతో మిడిల్‌ఎసెక్స్‌ 18 బంతులు మిగులుండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టామ్ వెస్లీ (40), టెన్ డస్కటే (74)లు రాణించారు.

డివిలియర్స్‌ అంతర్జాతీయ సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. డివిలియర్స్‌ పేరిట అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది.

Story first published: Friday, July 19, 2019, 18:41 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X