న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సత్తా ఉన్నా చోటు దక్కలేదు: ఐపీఎల్‌లో అన్‌లక్కీ ప్లేయర్లు వీరే(ఫోటోలు)

4 deserving Indian players who are yet to play in the IPL

హైదరాబాద్: ప్రపంచంలో ఖరీదైన క్యాష్ రిచ్ టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. అలాంటి టోర్నీలో ఆడాలని భారత క్రికెటర్లతో పాటు విదేశాలకు చెందిన ఎంతోమంది క్రికెటర్లు ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు.

ఈ వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారు. ఇందులో మొత్తం 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అంతేకాదు 200 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. 800మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌తో పాటు ముగ్గురు అనుబంధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

800 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌లో 746 మంది ఆటగాళ్లు భారతీయులే కావడం విశేషం. ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇక, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు.

ఇంకా, కొంతమంది క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ... ఐపీఎల్‌ ప్రాంఛైజీలను ఆకట్టుకోలేకపోయారు. అలాంటి అన్ లక్కీ ప్లేయర్లను ఒక్కసారి పరిశీలిద్దాం....

రజనీష్ గుర్బాని

రజనీష్ గుర్బాని

2017-18 రంజీ సీజన్‌లో విదర్భ జట్టు తరుపున రజనీష్ గుర్బాని అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో రజనీష్ గుర్బాని మొత్తం 6 మ్యాచ్‌లాడి 39 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి 2017-18 రంజీ సీజన్‌లో విదర్భ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ గతేడాది ఐపీఎల్‌ 2018 వేలంలో రజనీష్ గుర్బానీని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం విశేషం.

బాబా ఇంద్రజిత్

బాబా ఇంద్రజిత్

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న బాబా అపరాజిత్ సోదరుడే ఈ బాబా ఇంద్రజిత్. గత కొన్ని సంవత్సరాలుగా దేళవాళీ క్రికెట్‌లో చక్కటి స్ట్రయిక్ రేట్‌ని సాధించాడు. రంజీల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బాబా ఇంద్రజిత్ అటు రంజీ క్రికెట్‌లో ఇటు విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్‌లో బాబా ఇంద్రజిత్ యావరేజి 48గా ఉంది. 2018-19 దులిప్ ట్రోఫీలో ఇండియా గ్రీన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

జలజ్ సక్సేనా

జలజ్ సక్సేనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అన్ లక్కీ ప్లేయర్లలో జలజ్ సక్సేనా ఒకడు. గత దశాబ్దంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచాడు. 31 ఏళ్ల జలజ్ సక్సేనా గత నాలుగేళ్లలో నాలుగు బీసీసీఐ అవార్డులను సొంతం చేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడి సక్సెస్‌కు ఈ అవార్డులే నిదర్శనం. 2013 సీజన్‌లో జలజ్ సక్సేనాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. రెండేళ్ల పాటు ముంబై రిజర్వ్ బెంచికే పరిమితమైన జలజ్ సక్సేనాను ఆ తర్వాత వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి.

నవదీప్ షైనీ

నవదీప్ షైనీ

ఈ మధ్య కాలంలో దేళవాళీ క్రికెట్‌లో భారత విజయాల్లో తరచూ వినిపిస్తోన్న పేరు నవదీప్ షైనీ. గత మూడు నాలుగేళ్ల నుంచి భారత జట్టులో కూడా అత్యుత్తమ పేస్ బౌలర్లు వెలుగులోకి వస్తున్నారు. ఢిల్లీకి చెందిన నవదీప్ షైనీ సుమారు 140 kmph తో బంతిని సంధించగలడు. 2017 ఐపీఎల్ వేలంలో నవదీప్ షైనీని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంఛైజీ రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. 2017-18 రంజీ సీజన్‌లో 34 వికెట్లు, 2018-19 విజయ్ హాజారే ట్రోఫీలో 16 వికెట్లు పడగొట్టాడు. గతేడాది నిర్వహించిన వేలంలో నవదీప్ షైనీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 3 కోట్లకు సొంతం చేసుకున్నప్పటికీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

Story first published: Wednesday, December 12, 2018, 16:41 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X