WC 2020: సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోని ఆ నలుగురు ఎవరు?

ICC T20 WC 2020 : 5 Active Indian Players Who Are Not Being Considered By Selectors ! || Oneindia

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై పడింది. 8 జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. మరో రెండు జట్లు వచ్చే నెలలో జరగనున్న క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా అర్హత సాధిస్తాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది టీమిండియా ఎక్కువ టీ20 క్రికెట్‌ను ఆడనుంది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం వన్డేల్లో ఆడుతున్న కొందరు ఆటగాళ్లు మాత్రమే టీ20 ఫార్మాట్‌కు సరిపోతారని వెల్లడించాడు. టీ20ల్లో భారత ఆటగాళ్లు భయంలేని క్రికెట్ ఆడాలని పిలుపునిచ్చాడు.

కోచ్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి తన్నిన ఆటగాడు.. ఎందుకో తెలుసా? (వీడియో)

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టులో చోటు దక్కని ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం...

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా తరుపున రవిచంద్రన్ అశ్విన్ వైట్ బాల్ క్రికెట్ ఆడి సుమారు రెండేళ్లు అవుతుంది. టెస్టుల్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్న అశ్విన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇందుకు కారణం చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లే. వీరిద్దరూ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో గత కొన్నేళ్లుగా రాణిస్తుండటంతో సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు చోటు దక్కడం లేదు. గత రెండు సీజన్ల ఐపీఎల్‌లో మొత్తం 28 గేమ్‌లు ఆడిన అశ్విన్ 25 వికెట్లు తీశాడు.

కుల్దీప్ యాదవ్

కుల్దీప్ యాదవ్

గత రెండు సంవత్సరాలుగా కుల్దీప్ యాదవ్ మూడు ఫార్మట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లాండ్ ఇటీవలే వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం ప్రధాన స్పిన్నర్‌గా రాణించాడు. అయితే, గత కొన్ని నెలలుగా కుల్దీప్ యాదవ్ ప్రదర్శనలో మార్పు వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున పేలవ ప్రదర్శన చేశాడు. అనంతరం ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ప్రస్తుతం సొంతగడ్డపై సఫారీలతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో సైతం అతడికి చోటు దక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారంది.

కేదార్ జాదవ్

కేదార్ జాదవ్

29 ఏళ్ల వయసులో 2017లో కేదార్ జాదవ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహారిస్తున్నాడు. బ్యాట్‌మన్‌గానే కాకుండా స్పిన్నర్‌గా కీలకమ సమయాల్లో వికెట్లు తీయగల సమర్ధుడు. దీంతో గత రెండేళ్లుగా వన్డే జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే, టీ20 క్రికెట్ విషయానికి వస్తే అతడి ప్రదర్శన ఆ స్థాయిలో లేదు. చివరగా అక్టోబర్ 2017లో భారత్ తరుపున టీ20 ఆడాడు. 2015లో టీ20ల్లోకి అరంగేట్రం చేసినప్పటికీ భారత్ తరుపున ఇప్పటివరకు కేవలం 9 టీ20లు మాత్రమే ఆడాడు.

అక్షర పటేల్

అక్షర పటేల్

టీ20 క్రికెట్ తొలి నాళ్లలో అక్షర పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అదే ఏడాది టీమిండియా తరుపున అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత అక్షర పటేల్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇండియా-ఏ తరుపున ఆడుతున్నాడు. చివరగా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, September 18, 2019, 14:01 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X