న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టీ20: తిప్పేసిన చాహల్, భారత్‌దే టీ20 సిరిస్

బెంగుళూరు వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 

By Nageshwara Rao

హైదరాబాద్: సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టెస్టు, వన్డే సిరిస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గెలుచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఆ తర్వాత 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో దూకుడుగా ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 10 ఓవర్ల తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జాసన్ రాయ్‌ (32), జో రూట్‌ (42), ఇయాన్‌ మోర్గాన్‌ (40)లు మాత్రమే రాణించారు.

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఐదుగురు ఆటగాళ్లు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. బిల్లింగ్స్, జోస్ బట్లర్, ప్లంకెట్, జోర్డాన్, మిల్స్‌లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ ఆరు వికెట్లు తీసుకోగా, బుమ్రా మూడు, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీసుకున్నాడు.


తిప్పేసిన చాహల్

బెంగుళూరులో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్ఫిన్నర్ చాహల్ తిప్పేశాడు. దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను తన స్పిన్‌తో తిప్పేశాడు. 14వ ఓవర్‌ చాహల్ బౌలింగ్‌లో మూడు, నాలుగు బంతులకు కెప్టెన్ మోర్గాన్, జో రూట్‌లను అవుట్ చేశాడు. 21 బంతులను ఎదుర్కొన్న మోర్గాన్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఇక 37 బంతులను ఎదుర్కొన్న జో రూట్ చాహల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ వెనుదిరిగాడు.

yuzvendra-chahal

ఒకే ఓవర్‌లో మూడు సిక్సులు
లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడుతున్నారు. 12వ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు. పార్ట్ టైమ్ బౌలర్‌ సురేశ్ రైనా వేసిన ఈ ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెలరేగిపోయాడు. ఏకంగా మూడు సిక్సర్లు సాధించాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది.

England win third toss in a row, elect to bowl first against India in Bengaluru

11 ఓవర్లకు 92 పరుగులు చేసిన ఇంగ్లాండ్
203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 11 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో బిల్లింగ్స్ డకౌట్ కాగా, జాసన్ రాయ్‌ని 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ మోర్గాన్ 19, రూట్ 38 పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి 54 బంతుల్లో 111 పరుగులు చేయాల్సి ఉంది.


టీమిండియా బ్యాటింగ్ సాగిందిలా:

బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ముందు 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో సురేశ్ రైనా (63), ధోని (56)లు అర్ధ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యువరాజ్ సింగ్ 27, కేఎల్ రాహుల్ 22, హార్ధిక్ పాండ్యా 11 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, ప్లంకెట్, జోర్డాన్, మిల్స్ తలో వికెట్ తీసుకున్నారు.

Dhoni

టీ20ల్లో ధోని తొలి అర్ధ సెంచరీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టీ20లో తొలి అర్ధసెంచరీని నమోదు చేశాడు. ఇప్పటివరకు టీ 20ల్లో 66 ఇన్నింగ్స్ ఆడిన ధోనీ ఇంగ్లండ్‌పై ఆ మైలురాయి దాటాడు. కేవలం 32 బంతుల్లోనే 4 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 48 నాటౌట్ ధోనీ అత్యధిక స్కోరు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో ధోని వీర విహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌లో వచ్చిన ధోని ఆది నుంచే దూకుడుగా ఆడాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రైనా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. 18వ ఓవర్‌లో ధోనితో కలిసి ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌లో యువీ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. దీంతో 10 బంతుల్లో 27 పరుగులు చేసి చివరకు మిల్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

అర్ధసెంచరీ చేసిన ధోని: సిక్సులతో చెలరేగిన యువీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో ధోని అర్ధసెంచరీని నమోదు చేశాడు. 32 బంతులను ఎదుర్కొన్న ధోని 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ జోర్డాన్ బౌలింగ్‌లో మూడు సిక్సులు, ఒక ఫోర్‌ బాది మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

Yuvi and Dhoni

63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనా అవుట్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్లంకెట్ బౌలింగ్‌లో 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనా పెవిలియన్‌కు చేరాడు. 45 బంతులను ఎదుర్కొన్న రైనా ఐదు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో ఈ పరుగులు సాధించాడు. ప్లంకెట్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రైనా అవుటైన తర్వాత క్రీజులోకి యువరాజ్ వచ్చాడు. దీంతో టీమిండియా 14.5 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

Raina

రైనా అర్ధసెంచరీ
కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా దూకుడిగా ఆడి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. మూడో ఓవర్ చివరి బంతికి బోణీ సిక్సర్ కొట్టిన రైనా, వికెట్లను వదిలి లెగ్‌సైడ్ వచ్చి లాఫ్టెడ్ షాట్‌తో బంతిని గాల్లో బౌండరీ దాటించాడు. రెండో సిక్స్‌తో అభిమానుల్లో ఫుల్‌ జోష్ నింపాడు. అదే ఊపులో లాంగ్ లెగ్ మీదుగా మూడో సిక్స్‌ కొట్టాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా నాలుగో సిక్స్‌తో అర్థ సెంచరీ (41 బంతుల్లో 61 పరుగులు) పూర్తి చేశాడు. ఇలా ఐదు సిక్సులు కొట్టాడు.

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 18 బంతులను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 2 ఫోర్లు, ఒక సిక్సుతో 22 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. రాహుల్ అవుటైన తర్వాత ధోని క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 8 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 67 పరుగులు చేసింది.

Rahul

50 పరుగుల మార్క్‌ని అందుకున్న టీమిండియా
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో 50 పరుగుల మార్క్‌ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 6 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో సురేశ్ రైనా 30, కేఎల్ రాహుల్ 30 పరుగులతో ఉన్నారు.

నాలుగో బంతికే కోహ్లీ రనౌట్

బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జోర్డాన్ బౌలింగ్‌లో రెండో బంతి కోహ్లీ ప్యాడ్ తగిలి పిచ్ పక్కకు వెళ్లింది. అప్పటికే ఓపెనర్ రాహుల్ క్రీజు వదిలి ముందుకు రావడంతో తాను కూడా ముందుకు పరిగెత్తాడు. ఈ సమయంలో జోర్డాన్‌... కోహ్లీ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి సురేశ్ రైనా వచ్చాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రైనా 2, కేఎల్ రాహుల్ 1 పరుగుతో ఉన్నారు.

Kohli

బెంగుళూరు వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేతిలో కోహ్లీ టాస్ ఓడిపోవడం ఈ సిరిస్‌లో వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.

టాస్ గెలిచిన అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ 'ఇది బిగ్ ఫైనల్. బౌలర్లు చాలా శ్రమించారు. ఈరోజు రాత్రి బ్యాట్స్‌మన్ కూడా బాగా రాణిస్తారని ఆశిస్తున్నాన'ని అన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'మొదటి రెండు మ్యాచ్‌ల కంటే బాగా బ్యాటింగ్ చేయాలి. భారీ స్కోరు చేయాలి' అని అన్నాడు.

దీంతో చివరిదైన మూడో టీ20ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదిలా ఉండే ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ అరంగేట్రం చేశాడు. ఇక ఇంగ్లాండ్ జట్టులోనూ ఓ మార్పు చోటు చేసుకుంది. డాసన్ స్థానంలో ప్లంకెట్‌ను తీసుకున్నారు. రెండ‌వ టీ20లో ఆన్‌లైన్ అంపైర్‌గా చేసిన సీ షాంసుద్దీన్ మూడో మ్యాచ్‌లో థర్డ్ అంపైర్‌గా బాధ్య‌త‌లు చేపట్ట‌ాడు.

రెండ‌వ మ్యాచ్‌లో జో రూట్ ఎల్బీడబ్ల్యూ నిర్ణ‌యం వివాదాస్పదం కావ‌డంతో కెప్టెన్ ఇయాన్ మోర్గ‌న్ అంపైర్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.టీ20 ఫార్మాట్‌లో ఇప్పటిదాకా ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ నెగ్గలేదు. దీంతో ఈ ఆ అవకాశాన్ని వదులు కోకూడదని కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది.

 3rd T20I: England win third toss in a row, elect to bowl first against India in Bengaluru

మరోవైపు ఇప్పటికే రెండు సిరీస్‌లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీ20 ఫార్మాట్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రెండో టీ20లో విజయం నుంచి అనూహ్యంగా ఓడిపోవడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్రంగా నిరాశ చెందాడు. భారత పర్యటనలో టెస్టు, వన్డే సిరిస్‌ని కోల్పోయినా.. టీ20 సిరిస్‌ను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

జట్ల వివరాలు:
ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా, పర్వేజ్ రసూల్, ఆశిష్ నెహ్రా, యుజవేంద్ర చాహాల్, జస్‌ప్రీత్ బుమ్రా, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) , భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, సామ్ బిలింగ్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్కీపర్), మొయిన్ ఆలీ, క్రిస్ జోర్డాన్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్, జోనాథన్ బెయిర్స్టో, జేక్ బాల్, లియం డాసన్, డేవిడ్ విల్లీ.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X