న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సమస్యపై దృష్టి సారిస్తాం: రాంచీ వన్డే ఓటమిపై విరాట్ కోహ్లీ

3rd ODI: We dont want to see anymore collapses, says Virat Kohli after Ranchi defeat

హైదరాబాద్: తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోవడాన్ని మళ్లీ తాను చూడదల్చుకోలేదని, ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించినప్పటికీ టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది.

డివిలియర్స్‌ రికార్డు బద్దలు: రాంచీ వన్డేలో కోహ్లీ ఖాతాలో మరో రికార్డుడివిలియర్స్‌ రికార్డు బద్దలు: రాంచీ వన్డేలో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్‌ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తాం" అని అన్నాడు.

తర్వాతి మ్యాచ్‌లలో మార్పులు ఖాయం

తర్వాతి మ్యాచ్‌లలో మార్పులు ఖాయం

"తర్వాతి మ్యాచ్‌లలో మార్పులు ఖాయం. చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంపై కసరత్తులు చేస్తాం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి. మూడు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా.. నేను నా ఆటను ఆడుతా. తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. కానీ నేను ఔటవ్వడం నిరాశను మిగిల్చింది. మేం గెలుస్తామని అనుకున్నా" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఆడమ్‌ జంపా అద్భుతం

ఆడమ్‌ జంపా అద్భుతం

"కానీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మా కంటే చక్కటి ప్రదర్శన చేశారు. ఆడమ్‌ జంపా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వారు ఈ విజయానికి అర్హులు" అని కోహ్లీ తెలిపాడు. కోహ్లీ వ్యాఖ్యలను బట్టి నాలుగు, ఐదు వన్డేల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత మూడు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసిన శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడులలో ఎవరో ఒకరిపై వేటు పడొచ్చు.

281 పరుగులకే టీమిండియా ఆలౌట్

281 పరుగులకే టీమిండియా ఆలౌట్

ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 281 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, కమిన్స్, రిచర్డ్‌సన్ తలో మూడు వికెట్లు తీసుకోగా... నాథన్ లియాన్‌కు ఒక వికెట్ లభించింది. ఈ విజయంతో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మార్చి 10న మొహాలీ వేదికగా జరగనుంది.

Story first published: Saturday, March 9, 2019, 12:44 [IST]
Other articles published on Mar 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X