న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా తరుపున ఒకే ఒక్క టెస్టు ఆడిన ముగ్గురు క్రికెటర్లు వీరే!

3 Indian Cricketers Who Have Played Only One Test | Oneindia Telugu
3 Indian cricketers who have played only one Test

హైదరాబాద్: ప్రతి ఏటా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతుండటంతో కొత్త కొత్త ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఐపీఎల్‌లో వారు చేసిన ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో సైతం చోటు దక్కించుకుంటున్నారు. తమకు లభించిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

అయితే, కొంత మంది టీమిండియాలో చోటు దక్కించుకున్నప్పటికీ కేవలం కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యారు. మరికొందరైతే ఒకే ఒక్క మ్యాచ్‌తో కనుమరుగయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ... భారత్ తరుపున ఒకే ఒక్క టెస్టు ఆడిన ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు.

భారత్ తరుపున ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఆ తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, ఇప్పటికీ దేశవాళీ ‌క్రికెట్‌లో మాత్రం తమ జోరుని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరో ఒక్కసారి చూద్దామా?

వినయ్ కుమార్

వినయ్ కుమార్

రంజీల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న వినయ్ కుమార్ భారత తరుపున కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యుత్తమ వికెట్ టేకర్‌గా మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. 2012లో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ తరుపున ఆడాడు. ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక, పరమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ తరుపున అనేక మ్యాచ్‌ల్లో ఆడినప్పటికీ.... ఆ అనుభవాన్ని టెస్ట్ క్రికెట్‌లో సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2018/19 రంజీ సీజన్‌లో కర్ణాటక జట్టుక కెప్టెన్‌గా వినయ్ కుమార్ కొనసాగుతున్నప్పటకీ, ఆ జట్టు ప్రధాన పేసర్‌గా జట్టు విజయాల్లో కీలకం కానున్నాడు.

 నోమన్ ఓజా

నోమన్ ఓజా

రంజీ క్రికెట్‌లో భాగంగా మధ్య ప్రదేశ్ తరుపున అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున నోమన్ ఓజా రాణించడంతో భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2015లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నోమన్ ఓడా అందుబాటులో ఉన్న అత్తుత్తమ వికెట్ కీపర్ మాత్రమే కాకుండా బ్యాట్స్‌మన్‌గా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. భారత్ తరుపున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన నోమన్ ఓడా ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ప్రస్తుతం రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. ఇక, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లాంటి యువ ఆటగాళ్లు కీపింగ్‌లో చక్కగా రాణిస్తుండటంతో నోమన్ ఓజాను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

కర్ణ్ శర్మ

కర్ణ్ శర్మ

భారత్ తరుపున ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన మూడో క్రికెటర్ కర్ణ్ శర్మ. ఐపీఎల్‌ 2014లో కర్ణ్ శర్మ అద్భుత ప్రదర్శనకు ముగ్ధులైన సెలక్టర్లు ఆ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు కర్ణ్ శర్మకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన కర్ణ్ శర్మ అటు అభిమానులతో పాటు ఇటు సెలక్టర్లను సైతం నిరాశపరిచాడు. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన స్పిన్నర్లు రావడంతో కర్ణ్ శర్మను పక్కనబెట్టారు. రైల్వేస్ జట్టుతో పాటు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తోన్న లెగ్ స్పిన్నర్లలో కర్ణ్ శర్మ ఒకడు.

Story first published: Friday, November 9, 2018, 16:30 [IST]
Other articles published on Nov 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X