న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేప్‌టౌన్ టెస్టు, రెండో రోజు: హార్దిక్ పాండ్యా 'వన్ మ్యాన్ షో'

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 'వన్ మ్యాన్ షో'తో అదరగొట్టాడు. బ్యాటింగ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 93 పరుగులు చేసి ఆదుకున్న పాండ్యా... బంతితోనూ చెలరేగి దక్షిణాఫ్రికా ఓపెనర్లు మక్రమ్ (34), డీన్ ఎల్గర్ (25)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కి చేర్చాడు.

India vs South Africa 2018 1st Test Scorecard

దీంతో మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 65/2తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో నైట్‌ వాచ్‌మన్ కగిసో రబడ (2 బ్యాటింగ్: 15 బంతుల్లో), హసీమ్ ఆమ్లా (4 బ్యాటింగ్: 8 బంతుల్లో ఒక ఫోర్)తో ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా జట్టు కొనసాగుతోంది.

శనివారం 28/3ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రహానే స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ (11) పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఎండ్‌లో పాతుకుపోయిన చతేశ్వర్ పుజారా (26: 92 బంతుల్లో 5x4) పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు.

లంచ్ విరామం వరకూ అశ్విన్ (12)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ని నడిపించిన పుజారా.. అనంతరం తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అశ్విన్(12), సాహా (0) కూడా పెవిలియన్కు చేరడంతో భారత్ 92/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (93: 95 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సు)తో పరుగుల వరద పారించాడు.

పరుగు ఖాతా తెరవడానికి 34 బంతులు ఆడిన భువనేశ్వర్ కుమార్ (25: 86 బంతుల్లో 4 ఫోర్లు) ఆ తర్వాత చక్కటి డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ఎనిమిదవ వికెట్‌కి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. జట్టు స్కోరు 191 వద్ద భువీ ఔటవగా.. సెంచరీకి చేరువైన హార్దిక్ పాండ్యా అప్పర్ కట్ కొట్టే ప్రయత్నంలో జట్టు స్కోరు 199 వద్ద పెవిలియన్‌కు చేరాడు.

ఇన్నింగ్స్ చివర్లో బుమ్రా (2), షమీ (4) కాసేపు సఫారీ బౌలర్లని ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 3, రబాడ 3, స్టెయిన్ 2, మోర్నీ మోర్కెల్ 2 వికెట్లు తీసుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 7, 2018, 8:02 [IST]
Other articles published on Jan 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X