న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Yearend 2019: 157 wins in 249: వన్డేల్లో ఈ దశాబ్దం టీమిండియాదే!

157 wins in 249: India end decade as most successful ODI team

హైదరాబాద్: కటక్ వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్‌లో టీమిండియాకు ఇది 157వ విజయం కావడం విశేషం. గత పదేళ్ల కాలంలో ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా వన్డే క్రికెట్‌లో టీమిండియా తన ఆధిపత్యం చెలాయించింది.

2010 నుంచి 2019 మధ్య కాలంలో వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియాకు నిలిచింది. ఈ మధ్య కాలంలో 249 వన్డేలు ఆడిన టీమిండియా 157 వన్డేల్లో విజయం సాధించింది. నెంబర్లను పరిశీలిస్తే ఈ దశాబ్దంలో భారతదేశం వన్డేలలో ఎంత ఆధిపత్యం చెలాయించిందో మీకే అర్ధం అవుతుంది.

ఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీ

గెలుపు/ఓటముల శాతంలో 1.987తో టీమిండియా అగ్రస్థానం

గెలుపు/ఓటముల శాతంలో 1.987తో టీమిండియా అగ్రస్థానం

జనవరి 1, 2010 నుంచి డిసెంబర్ 22, 2019 మధ్య కాలంలో టీమిండియా గెలుపు/ఓటముల శాతం 1.987గా నమోదైంది. ఈ మధ్య కాలంలో టీమిండియా 249 వన్డేలు ఆడి కేవలం 79 వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది(6 టైగా ముగియగా, 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు).

రెండో స్థానంలో ఆస్ట్రేలియా

రెండో స్థానంలో ఆస్ట్రేలియా

గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య విషయానికి వస్తే ఆస్ట్రేలియా రెండవ స్థానంలో కొనసాగుతోంది. గత దశాబ్దంలో ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఈ దశాబ్దంలో మాత్రం 216 మ్యాచ్‌లు ఆడి 125 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా గెలుపు-ఓటములు నిష్పత్తి 1.582గా నమోదైంది.

1.500 శాతంతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో

1.500 శాతంతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో

ఈ జాబితాలో 1.500 శాతంతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 218 మ్యాచ్‌లు ఆడి 123 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ దశాబ్దపు మొదటి భాగంలో 1.676 శాతంతో దక్షిణాఫ్రికా విజయవంతమైన జట్టుగా నిలిచింది. మొదటి అర్దభాగంలో దక్షిణాఫ్రికా 188 మ్యాచ్‌లకు గాను 114 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే దశాబ్ధానికి వచ్చే సరికి నాలుగో స్థానంలో నిలిచింది.

 అత్యధిక సిరిస్ విజయాలు

అత్యధిక సిరిస్ విజయాలు

2010 నుంచి 2019 మధ్య కాలంలో అత్యధిక సిరిస్ విజయాలు(35) సాధించిన జాబితాలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్(32)తో రెండవ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా(30) విజయాలతో మూడవ స్థానంలో ఉంది. కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో గెలుపు-ఓటమి నిష్పత్తిలో టీమిండియా టాప్-3లో కనిపించక పోవడం విశేషం.

1990 మరియు 1999 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా 177 మ్యాచ్‌ల్లో 110 విజయాలతో గెలుపు-ఓటమి నిష్పత్తి 1.803గా నమోదు చేసింది. అదే సమయంలో (225 మ్యాచ్‌లలో 140 విజయాలు) గెలుపు-ఓటమి నిష్పత్తి 1.728గా నమోదు చేసిన ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. 1992 ప్రపంచ కప్ గెలిచిన దశాబ్దంలో పాకిస్తాన్(261 మ్యాచ్‌లలో 146 విజయాలు) గెలుపు-ఓటమి నిష్పత్తి 1.390గా నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది.

1990-1999 మధ్య కాలంలో టాప్-5

1990-1999 మధ్య కాలంలో టాప్-5

1990-1999 మధ్య కాలంలో టాప్-5 (వన్డే క్రికెట్‌లో గెలుపు-ఓటమి నిష్పత్తి పరంగా)

దక్షిణాఫ్రికా - 1.803

ఆస్ట్రేలియా - 1.728

పాకిస్తాన్ - 1.390

వెస్టిండీస్ - 1.078

టీమిండియా - 1.016

2000-2009 మధ్య కాలంలో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద టోర్నీల్లో గెలవడం ప్రారంభించింది. ఇందులో భాగంగా 2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు కూడా చేరింది. 2002లో గంగూలీ సారథ్యంలోని టీమిండియా నాట్ వెస్ట్ ట్రోఫీని గెలుచుకుంది.

2000-2009 మధ్య కాలంలో టాప్-5 జట్లు

2000-2009 మధ్య కాలంలో టాప్-5 జట్లు

2000-2009 మధ్య కాలంలో టాప్-5 జట్లు (వన్డే క్రికెట్‌లో గెలుపు-ఓటమి నిష్పత్తి పరంగా)

ఆస్ట్రేలియా - 3.060 (282 మ్యాచ్‌ల్లో 202 విజయాలు)

దక్షిణాఫ్రికా - 1.825 (254 మ్యాచ్‌ల్లో 157 విజయాలు)

శ్రీలంక - 1.396 (276 మ్యాచ్‌ల్లో 155 విజయాలు)

పాకిస్తాన్ - 1.360 (267 మ్యాచ్‌ల్లో 151 విజయాలు)

భారత్ - 1.238 (307 మ్యాచ్‌ల్లో 161)

Story first published: Monday, December 23, 2019, 15:19 [IST]
Other articles published on Dec 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X