న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన గంగూలీ: నేటితో 16 ఏళ్లు పూర్తి (వీడియో)

By Nageshwara Rao
లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన గంగూలీ: నేటితో 16 ఏళ్లు పూర్తి
13th July 2002: Kaif, Yuvraj Help India Seal Historic Win

హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వరల్డ్‌కప్ సాధించడం లేదా వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో పాకిస్థాన్ జట్టుపై టీమిండియా విజయం సాధించడం లాంటివి. అలాంటి మ్యాచ్‌లు భారత క్రికెట్ అభిమాని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

ఈ కోవలోకి వచ్చే ఓ గొప్ప మ్యాచ్ నాట్‌వెస్ట్ ఫైనల్ మ్యాచ్(జులై 13, 2002). ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గుర్తుకు రాగానే ముందుగా మదిలో మెదిలే అపురూప ఘట్టం టీమిండియా మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ చొక్కా విప్ప చేసిన హంగామా.

ఈ అపురూపమైన ఘట్టానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ శుక్రవారం అభిమానులతో పంచుకుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన నాట్‌వెట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానంతరం బాల్కనీలో ఉన్న గంగూలీ చొక్కా విప్పి చేసిన సంబరాలు చేసుకున్నాడు.

అప్పట్లో ఇదొక సంచలనం. తన దూకుడుతో భారత్ క్రికెట్ ఆటతీరునే మార్చేసిన అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడు. ప్రత్యర్థి స్టేడియంలో చొక్కా విప్పి భారత్ విజయాన్ని సగర్వంగా ఆస్వాదించడం ఒక్క గంగూలీకే చెల్లింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌సింగ్, మహ్మద్ కైఫ్ ఆఖరి వరకు పోరాడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యువరాజ్ సింగ్ (63 బంతుల్లో 69), కైఫ్ (87) పరుగులు చేసి సెంచరీ భాగస్వామ్యంతో భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.

Story first published: Friday, July 13, 2018, 16:39 [IST]
Other articles published on Jul 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X