న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1 win in 26 years: టెస్టుల్లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ చెత్త రికార్డు!

1 win in 26 years: Why Australia vs New Zealand Trans-Tasman rivalry is the most lopsided in the world

హైదరాబాద్: సిడ్నీలో జరిగిన చివరిదైన మూడో టెస్టులో సోమవారం 279 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ పర్యటన ముగిసింది. ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీలో భాగంగా 1993-94లో న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా తాజాగా మరోసారి సత్తా చాటింది.

వాస్తవానికి ఈ టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందు గతేడాది డిసెంబర్‌లో పెర్త్‌లో సిరీస్ ప్రారంభం కావడానికి ముందే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని విస్తృత ప్రచారం సాగింది. సిరిస్ మొదలైన తర్వాత ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది.

జింబాబ్వేతో పాటు టెస్ట్ క్రికెట్‌లో కొత్తగా ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌ దేశాలను మినహాయించినట్లయితే... ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సిడ్నీ టెస్టు ఫలితం అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచింది. ఎందుకంటే...

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో

1990ల్లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో జాన్ రైట్ న్యూజిలాండ్‌ని విజయం దిశగా నడిపించినప్పటి నుండి న్యూజిలాండ్ ఆడిన మొత్తం 34 టెస్టుల్లో కేవలం 2 టెస్టుల్లో మాత్రమే విజయాం సాధించి.... 24 టెస్టుల్లో ఓటమిపాలైంది. ఈ రెండు విజయాల్లో మొదటిది 1993లో ఆక్లాండ్‌లో మార్టిన్ క్రోవ్ నాయకత్వంలో సాధించింది.

రాస్ టేలర్ నాయకత్వంలోని

రాస్ టేలర్ నాయకత్వంలోని

ఆ తర్వాత రాస్ టేలర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు 2011లో హోబర్ట్‌లో గెలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టుకు రాస్ టేలర్ కెప్టెన్‌గా వ్వవహారించాడు. దీని అర్ధం గడచిన 26 ఏళ్లలో న్యూజిలాండ్... ఆస్ట్రేలియాపై కేవలం ఒకే ఒక్క టెస్టులో గెలిచింది. ఈ కాలంలో టెస్టు క్రికెట్ ఆడే ఏ పెద్ద దేశం కూడా ఇంతటి చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకోలేదు.

దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌ల్లోనూ

దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌ల్లోనూ

ఇక, దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ చెత్త రికార్డుని కలిగి ఉంది. ఇదే కాలంలో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్(2 మ్యాచ్‌లు, 28 మ్యాచ్‌ల్లో 16 ఓటములు) రికార్డుని కలిగి ఉంది. గత 30 ఏళ్లలో క్రికెట్‌లో అత్యధికంగా ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్‌లు ఇవే కావడం విశేషం.

గత 30 ఏళ్లలో క్రికెట్‌లో

గత 30 ఏళ్లలో క్రికెట్‌లో

న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా: 35-3-24-0.125

న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా: 28-2-16-0.125

వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా: 28-3-18-0.166

శ్రీలంక vs ఆస్ట్రేలియా: 27-4-16-0.25

పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా: 26-4-15-0.266

పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా: 35-6-22-0.272

మిగతా అన్ని దేశాలతో

మిగతా అన్ని దేశాలతో

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, గత మూడు దశాబ్దాలలో మిగతా అన్ని దేశాలతో కలిపి వారి టెస్ట్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. ఇదే కాలంలో న్యూజిలాండ్ ఆడిన మిగతా దేశాల్లో 153 టెస్టులు ఆడి 62 మ్యాచ్‌ల్లో గెలిచి 47 టెస్టుల్లో ఓడిపోయారు.

Story first published: Monday, January 6, 2020, 17:46 [IST]
Other articles published on Jan 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X