మూడో స్థానంలో సురేశ్ రైనా: ధోనిని అధిగమించాడు

Posted By:
1,452 runs for Suresh Raina, the 3rd-most by an Indian in t20s

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రైనా మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ధోనిని రైనా వెనక్కినెట్టాడు.

ముక్కోణపు టీ20 సిరిస్: లంకను చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ కన్ఫమ్

సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న రైనా ముక్కోణపు టోర్నీలో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20ల్లో రైనా పరుగుల సంఖ్య 1,452కి చేరింది. ఈ నేపథ్యంలో ధోని (1,444)ని అధిగమించాడు.

ఇక, ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ(1,983), రోహిత్‌ శర్మ(1,696) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. రైనా మరో 48 పరుగులు చేస్తే 1,500 పరుగుల క్లబ్‌లో చేరతాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 11వ సీజన్‌లో సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

India vs Sri Lanka 2018 Match 4 Score Card

నిదాహాస్ ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా భారత్‌ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సిరిస్‌కు కెప్టెన్ కోహ్లీ, ధోనిలతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, March 13, 2018, 13:27 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి