న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆతిథ్యం భారత్ చేజారె!!

India loses hosting rights of mens World Boxing Championship

ఢిల్లీ: వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2021 ఆతిథ్య హక్కులు భారత్‌ చేజారాయి. ఆతిథ్య ఫీజు చెల్లించడంలో భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) విఫలం కావడంతో ఈ టోర్నీని నిర్వహించే అవకాశాన్ని సెర్బియా దక్కించుకుంది. ఈ విష‌యాన్ని మంగళవారం అంత‌ర్జాతీయ బాక్సింగ్ అసోసియేష‌న్ (ఏఐబీఏ) స్ప‌ష్టం చేసింది.

'అర్జున్ టెండూల్కర్ తప్పకుండా భారత్ తరఫున ఆడతాడు''అర్జున్ టెండూల్కర్ తప్పకుండా భారత్ తరఫున ఆడతాడు'

2017లో జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం 2021లో పురుషుల బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌న‌కు భార‌త్ ఆతిథ్య‌మివ్వాల్సి ఉండ‌గా.. రుసుము చెల్లించ‌ని కార‌ణంగా ఆతిథ్యం వ‌హించే అవ‌కాశం సెర్బియాకు ద‌క్కింది. బెల్‌గ్రేడ్ టోర్నీ నిర్వ‌హించేందుకు కావాల్సిన అన్ని వ‌స‌తులు ఉన్నాయని ఏఐబీఏ పేర్కొంది.

'2017లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆతిథ్య నగరం ఢిల్లీ గతేడాది డిసెంబర్‌ 2 లోపు సుమారు రూ.30 కోట్లు చెల్లించాలి. కానీ చెల్లించలేకపోయింది. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. టోర్నీని వదులుకున్నందుకు భారత్‌ 500 డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది' అని ఐబా ఒక ప్రకటనలో తెలిపింది.

ఆతిథ్యానికి సంబంధించిన రుసుము చెల్లించ‌ని కార‌ణంగా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్ టోర్నీ భార‌త్ నుంచి సెర్బియాకు త‌ర‌లివెళ్లింది. దేశంలో తొలిసారిగా జరిగే ఈ టోర్నీని సెర్బియా నగరమైన బెల్‌గ్రేడ్లో జరుగుతుంది. 'అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు మరియు బాక్సింగ్ అభిమానుల కోసం అన్ని వసతులు సెర్బియాలో ఉన్నాయి' అని ఐబా తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ మౌస్టాహ్సేన్ పేర్కొన్నారు.

Story first published: Wednesday, April 29, 2020, 10:28 [IST]
Other articles published on Apr 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X