న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం నుంచి ఫ్రెంచ్ ఓపెన్: టాప్‌సీడ్‌గా బరిలోకి సైనా

Tricky draw for Saina in French Open

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతోంది. డెన్మార్క్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఒక్క రోజులోనే సైనా నెహ్వాల్ మరో అంతర్జాతీయ టోర్నీకి సిద్ధం కావడం గమనార్హం.

<strong>సైనా నెహ్వాల్‌కు తప్పని నిరాశ, టోర్నీ నుంచి ఇంటికి..</strong>సైనా నెహ్వాల్‌కు తప్పని నిరాశ, టోర్నీ నుంచి ఇంటికి..

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరేట్‌గా ఫ్రాన్స్‌కు పయనమైన సైనా నెహ్వాల్ తొలిరౌండ్లో చైనా అన్‌సీడెడ్ షట్లర్ లీ హాన్‌తో తలపడనుంది. క్వార్టర్‌ ఫైనల్ దాకా ఎలాంటి అడ్డంకి లేని సైనాకు సెమీస్‌లో డెన్మార్క్ ఓపెన్ రన్నరప్, నాలుగోసీడ్ జులియన్ షెంక్‌తో తలపడే అవకాశం ఉంది.

కాగా, డెన్మార్క్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అకానె యమగూచి, నొజొమి ఒకుహర (జపాన్‌) వంటి స్టార్‌ క్రీడాకారిణులను మట్టికరిపించిన సైనా ఫైనల్లో మాత్రం టాప్‌సీడ్‌ తై జుకు తలొగ్గింది.

ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత సింగిల్స్‌ ఫైనల్లో సైనా 13-21, 21-13, 6-21తో తై జు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడి రన్నరప్‌తో సంతృప్తిపడింది. ఈ ప్రదర్శనతో సైనాపై విజయాల రికార్డును తై జు 13-5కు పెంచుకుంది. 2014 తర్వాత ఆడిన 11 మ్యాచ్‌ల్లో సైనాపై యింగ్‌దే పైచేయి.

అంతేకాదు.. ఈ ఏడాది తై జు చేతిలో సైనాకిది వరుసగా ఐదో ఓటమి కావడం విశేషం. 52 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో యింగ్‌కు సైనా గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్‌లో తేలిపోయినా.. రెండో గేమ్‌లో గొప్పగా ఆడింది. అయితే నిర్ణయాత్మక గేమ్‌లో సైనా ఓడిపోయింది.

Story first published: Monday, October 22, 2018, 18:42 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X