
ఓటు వేసిన పీవీ సింధు, గోపీచంద్
బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లు తమ కుటుంబసభ్యులతో పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని, ఓటర్లు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

గుత్తా జ్వాలా పేరు ఓటర్ల జాబితాలో గల్లంతు
ఇదిలా ఉంటే, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పేరు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యింది. శుక్రవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక జాబితాలో పేరు లేకపోవడంతో షాకయ్యారు. దీంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
|
ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన గుత్తా జ్వాలా
గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని.. ఇప్పుడు తన ఓటు లేదని పేరును ఎందుకు తొలగించారో తెలియదని ఆమె అన్నారు. తన ఓటు గల్లంతవ్వడంపై గుత్తా జ్వాలా ట్విట్టర్‌లో మండిపడ్డారు.
|
ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు
"ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు నా పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడం ఆశ్చర్యమేసింది. ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతున్నట్లు" అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా తమ ఓట్లు గల్లంతయ్యాయని గుత్తా జ్వాలతో చెప్పారు. ఆమె ట్వీట్లను రీ ట్వీట్ చేశారు.
|
ఫిల్మ్‌నగర్‌లో ఓటేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చిన సానియా హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ఓటేశారు. ఇదిలా ఉంటే, ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మధ్యాహ్నాం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.09 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.