న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్ జాబితా విడుదల: టాప్-10లో పీవీ సింధు, సంపాదన ఎంతో తెలుసా?

By Nageshwara Rao
PV Sindhu 7th highest paid female athlete in the world: Forbes

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకుంది. 2018 ఏడాదికిగాను ఫోర్బ్స్ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. బుధవారం ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణీల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.

టోర్నీలు ఆడటం ద్వారా అందుకునే ప్రైజ్‌మనీతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా వీరు అందుకుంటున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్‌ ఈ జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో పీవీ సింధు ఏడో స్థానంలో నిలిచింది. మొత్తంగా టాప్ టెన్‌లో ఇద్దరు తప్ప మిగతా అందరూ టెన్నిస్ ప్లేయర్సే కావడం విశేషం.

ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. భారత్ నుంచి టెన్నిస్‌ క్రీడాకారిణులు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో టాప్‌-10లో నిలిచారు. అందులో పీవీ సింధు ఒకరు. ఇదిలా ఉంటే ఈ జాబితాలో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచింది.

PV Sindhu 7th highest paid female athlete in the world: Forbes

సెరెనా ఏడాది సంపాదన 1.81 కోట్ల డాలర్లు (సుమారు రూ.125 కోట్లు)గా ఉంది. ఇక ఏడోస్థానంలో ఉన్న సింధు 85 లక్షల డాలర్లు (సుమారు రూ.59 కోట్లు) సంపాదించింది. ఆమె కాకుండా టాప్ టెన్‌లో ఉన్న మరో టెన్నిసేతర ప్లేయర్ డానికా పాట్రిక్ మాత్రమే. రూ.52 కోట్ల సంపాదనతో ఆమె 9వ స్థానంలో ఉంది.

ఈ జాబితాలో సెరెనా అగ్రస్థానంలో నిలవడం వరుసగా మూడోసారి. గతేడాది బిడ్డకు జన్మనివ్వడం వల్ల సెరెనా కొంతకాలం టెన్నిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలోనే తిరిగి రాకెట్ పట్టిన సెరెనా లండన్ వేదికగా జరిగిన వింబుల్డన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో జర్మనీకి చెందిన కెర్బర్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

టోర్నీల్లో గెలవడం ద్వారా ఆమె కేవలం 62 వేల డాలర్లు మాత్రమే సంపాదించినా.. ఎండార్స్‌మెంట్ల ద్వారా 1.81 కోట్ల డాలర్లు ఆర్జించడం విశేషం. ఈ విషయంలో ఏ మహిళా ప్లేయర్‌కు కూడా అందనంత ఎత్తులో సెరెనా ఉంది. సెరెనా తన కెరీర్‌లో టెన్నిస్ కోర్టులో సంపాదించిన దాని కంటే రెట్టింపు బయట సంపాదించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.

టాప్‌-10 చోటు దక్కించుకున్న క్రీడాకారిణులు:

1. సెరెనా విలియమ్స్‌ - టెన్నిస్‌ - 18.1 మిలియన్లు

2. కరోలిన్‌ వొజ్నొకి- టెన్నిస్‌ - 13 మిలియన్లు

3. స్లోనే స్టీఫెన్స్‌ - టెన్నిస్‌ - 11.2 మిలియన్లు

4. గార్బిన్‌ ముగురుజ - టెన్నిస్‌ - 11 మిలియన్లు

5. మరియా షరపోవా - టెన్నిస్‌ - 10.5 మిలియన్లు

6. వీనస్‌ విలియర్స్‌ - టెన్నిస్‌ - 10.2 మిలియన్లు

7. పీవీ సింధు - బ్యాడ్మింటన్‌ - 8.5 మిలియన్లు

8. సిమోనా హలెప్‌ - టెన్నిస్‌ - 7.7 మిలియన్లు

9. డానిక పాట్రిక్‌ - రేస్‌ కార్‌ డ్రైవర్‌ - 7.5 మిలియన్లు

10. కెర్బర్‌ - టెన్నిస్‌ - 7 మిలియన్లు

Story first published: Wednesday, August 22, 2018, 13:29 [IST]
Other articles published on Aug 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X