న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్ హోదా: అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం తీర్మానం

By Nageshwara Rao
Kidambi Srikanth got deputy collector post from Andhra Pradesh govt

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. కిదాంబికి డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం (డిసెంబర్ 2) బిల్లుకు ఆమోదం తెలిపింది. గతంలో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు కూడా ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించిన సంగతి తెలిసిందే.

2017 కిదాంబి శ్రీకాంత్‌దే: సంపాదనలో అగ్రస్ధానం2017 కిదాంబి శ్రీకాంత్‌దే: సంపాదనలో అగ్రస్ధానం

గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకుని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ ఏడాది జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. ఆ తర్వాత అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లు నెగ్గిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ ఏడాది తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. తద్వారా డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరగనున్న బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు కూడా కిదాంబి శ్రీకాంత్ అర్హత సాధించాడు. భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ సిరిస్‌కు అర్హత సాధించగా.. అందులో శ్రీకాంత్ ఒకడు.

దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్: భారత్ నుంచి ఇద్దరే, ఆ ఇద్దరూ తెలుగువారేదుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్: భారత్ నుంచి ఇద్దరే, ఆ ఇద్దరూ తెలుగువారే

ఇలా ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేసిన కిదాంబి శ్రీకాంత్‌‌కు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది.

Story first published: Saturday, December 2, 2017, 17:46 [IST]
Other articles published on Dec 2, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X