న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రిక్వార్ట‌ర్స్‌లో సైనా, ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్.. రెండో రోజు కూడా భార‌త్‌దే హ‌వా

India Open: Saina Nehwal, HS Prannoy, Lakshya Sen wins first round

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ 500 టోర్నీలో రెండో రోజు కూడా భార‌త ఆట‌గాళ్లు స‌త్తా చాటారు. వెటర‌న్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్‌తో స‌హా హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్ ముందంజ వేశారు. ఇక డ‌బుల్స్ మ్యాచ్‌ల్లో సిక్కి రెడ్డి- అశ్వినీ పొన‌ప్ప‌, సాత్విక్ సాయి రాజ్- చిరాగ్ శెట్టి, నితిన్‌- అశ్విని భ‌ట్ త‌దిత‌రులు త‌ర్వాతి రౌండ్‌లోకి ప్ర‌వేశించారు.

ప్రిక్వార్ట‌ర్స్‌లో సైనా

ప్రిక్వార్ట‌ర్స్‌లో సైనా

మ‌హిళ‌ల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ చెక్ రిప‌బ్లిక్‌కు చెందిన తెరెజా స్వ‌బికోవాపై 22-20, 1-0తో గెలుపొంది ప్రిక్వార్ట‌ర్స్‌లోకి అడుగుపెట్టింది. చివ‌రి వ‌ర‌కు హోరాహోరిగా సాగిన తొలి సెట్‌లో సైనా 22-20 తేడాతో విజ‌యం సాధించింది. ఇక రెండో సెట్ ఆరంభంలోనే స్వ‌బికోవా వెన్ను నొప్పితో మ్యాచ్ నుంచి త‌ప్పుకుంది.

దీంతో సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది. ప్రి క్వార్ట‌ర్‌లో సైనా మాళ‌విక బాన్సోద్‌తో త‌ల‌ప‌డ‌నుంది. మిగ‌తా మ్యాచ్‌ల్లో ఆక‌ర్శి క‌శ్య‌ప్ 21-14, 21-14 తేడాతో అనుర ప్ర‌భుదేశాయ్‌పై విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్‌లో కెయుర మోపాటి 15-21, 21-19, 21-8తో స్మిత్ తోష్నివాల్‌పై గెలుపొంది త‌దుప‌రి రౌండ్ చేరింది.

ప్ర‌ణ‌య్‌, ల‌క్ష్య‌సేన్‌కు విజ‌యాలు

ప్ర‌ణ‌య్‌, ల‌క్ష్య‌సేన్‌కు విజ‌యాలు

పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ అయిన‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్య సేన్ 21-15, 21-7 తేడాతో ఈజిప్ట్‌కు చెందిన ఆడ‌మ్ హేతెమ్‌పై విజ‌యం సాధించి ప్రి క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక స్పెయిన్‌కు చెందిన పాబ్లో అబియన్‌పై హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ 21-14, 21-17 తేడాతో గెలుపొందాడు. ప్రాన్స్‌కు చెందిన అర్నాడ్ మోర్కెల్‌పై 21-16, 15-21, 21-1తో మిథున్ మంజునాథ్ విజ‌యం సాధించాడు.

డ‌బుల్స్‌లోనూ భార‌త్ స‌త్తా

డ‌బుల్స్‌లోనూ భార‌త్ స‌త్తా

ఇక డ‌బుల్స్‌లోనూ భార‌త ఆట‌గాళ్లు స‌త్తా చాటారు. పురుషుల డ‌బుల్స్‌లో రెండో సీడ్ సాత్విక్ సాయి రాజ్‌- చిరాగ్ శెట్టి తొలి రౌండ్‌లో ర‌వి - చిరాగ్ అరోరాపై 21-14, 21-10 తేడాతో గెలుపొందారు. మ‌రో మ్యాచ్‌లో శ్యామ్ ప్ర‌సాద్- సుంజిత్ 21-8, 21-17 తేడాతో అక్ష‌య్-రాజ్ రెహాన్‌పై గెలుపొందారు. ఇక మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో అశ్వినీ పొన్న‌ప్ప‌- సిక్కి రెడ్డి 21-7, 19-21, 21-13తో జ‌న‌నీ దివ్య‌పై విజ‌యం సాధించి రెండో రౌండ్ చేరారు.

 మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫ‌లితాలు

మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫ‌లితాలు

మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో నితిన్ - అశ్విని భట్ త‌మ తొలి రౌండ్లో 21-17, 15-21, 21- 12 తేడాతో గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. మ‌రో మ్యాచ్‌లో క‌శిష్ శ‌ర్మ‌-సారుణి శ‌ర్మ 21-17, 21-14తో కీర్తేష్- ద‌క్ష‌పై విజ‌యం సాధించి త‌దుప‌రి రౌండ్‌లోకి ప్ర‌వేశించారు.

Story first published: Thursday, January 13, 2022, 8:28 [IST]
Other articles published on Jan 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X