వరుసగా రెండో మ్యాచ్ లోనూ అదే హవాను కొనసాగిస్తున్న పురుషుల జట్టు

Posted By: Subhan
India men thrash Philippines in Badminton Asia Team Championship

హైదరాబాద్: ఒలింపిక్ సిల్వర్ విజేత పీవి సింధు మహిళల జట్టులో 3-2తో ఇరగదీస్తుంటే పురుషుల జట్టులోనూ అదే స్థాయిలో జోరు కొనసాగుతోంది. ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్‌ భారత్ హవాను కొనసాగిస్తుంది. భారత్ పురుషుల జట్టు ఫిలిప్పీన్స్‌ను 5-0తో చిత్తు చేసింది.

ఇదే తరహాలో రెండో మ్యాచ్‌లోనూ మాల్దీవులను కూడా మట్టికరిపించింది. తొలి సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-5, 21-6తో షహీద్‌ హుస్సేన్‌పై ఘనవిజయంతో భారత్‌కు శుభారంభాన్నందించాడు. మిగతా రెండు సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 21-10, 21-4తో అహ్మద్‌ నిబాల్‌ను, సమీర్‌ వర్మ 21-5, 21-1తో మహ్మద్‌ అలీని చిత్తు చేశారు.

యువ క్రీడాకారిణి అయిన శ్రీ క్రిష్ణ ప్రియ కుదరవల్లి మహిళల సింగిల్స్ లో చింగ్ యింగ్ మి తో తలపడింది. కానీ, ఆమె 19-21, 21-18, 20-22తో వెనుదిరగాల్సి వచ్చింది.

డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ 21-8, 21-8తో షహీద్‌-షహీమ్‌లపై, అర్జున్‌-శ్లోక్‌ 21-2, 21-5తో మహ్మద్‌ అలీ-నిబాల్‌లపై విజయాలు సాధించారు. భారత్‌ గురువారం తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇండొనేసియాను ఢీకొంటుంది. ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించిన మహిళల జట్టు గురువారం జపాన్‌ను ఢీకొంటుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 8:43 [IST]
Other articles published on Feb 8, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి