న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెనడా ఓపెన్.. ఫైనల్లో కశ్యప్ ఓటమి

Canada Open 2019: Parupalli Kashyap Settles for Silver After Final Loss

భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్‌ దూకుడుకు ఆడ్డుకట్ట పడింది. కెనడాలోని క్లాగరీ వేదికగా జరుగుతున్న కెనడా ఓపెన్‌ సూపర్ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో కామన్వెల్త్ గేమ్ ఛాంపియన్, హైదరాబాద్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ ఫైనల్లో ఓడిపోయాడు. దీంతో కశ్యప్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఆరోసీడ్‌ కశ్యప్ 22-20, 14-21, 17-21తో లీ షీ ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గంటా 16 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌ గెలిచినా.. రెండో గేమ్‌, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్‌లో పరాజయం పాలై రజత పతకం గెలుచుకున్నాడు.

ఈ టోర్నీలో తనకు అండగా నిలిచిన సహచర ఆటగాడు ప్రణయ్‌కు ట్విట్టర్ వేదికగా కశ్యప్ కృతజ్ఞతలు తెలిపాడు. యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కశ్యప్ వ్యక్తిగత కోచ్, ఫిజియో అమెరికాకు వెళ్లిపోయారు. అనంతరం ఆ బాధ్యతలను ప్రణయ్ నిర్వర్తిస్తున్నాడు. ఇక అమెరికాలోని ఫుల్లెర్టాన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో కశ్యప్ ఆడనున్నాడు.

ఈ టోర్నీ సెమీఫైనల్లో కశ్యప్‌ 14-21, 21-17, 21-18తో నాలుగో సీడ్‌ వాంగ్‌ జూ వీ (చైనీస్‌ తైపీ)పై విజయాన్ని సాధించాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 12-21, 23-21, 24-22 తేడాతో లుకాస్ క్లెర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఇక ప్రిక్వార్టర్స్ లో 23-21, 21-23, 21-19 తేడాతో రెన పెంగ్ బో(చైనా)పై చెమటోడ్చి గెలిచాడు.

Story first published: Tuesday, July 9, 2019, 8:40 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X