న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లైవ్ సెషన్‌లోనే జీవాతో ధోనీ బైక్ రైడ్!

Ziva gets a bike ride from MS Dhoni again inside their Ranchi farmhouse

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తన గారాలపట్టి జీవాతో కలిసి జాలీగా బైక్‌ రైడ్ చేశాడు. అది కూడా తన సతీమణి సాక్షి సింగ్ లైవ్ సెషన్‌లో ఉండగానే తన ఫామ్ హౌస్‌లో చక్కర్లు కొట్టాడు. కరోనా పుణ్యమా లభించిన ఈ విశ్రాంతి సమయాన్ని మహీ పూర్తిగా కుటుంబంతో ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ఇతర క్రికెటర్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుండగా.. ధోనీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లైవ్ సెషన్‌లో పాల్గొనలేదు.

కాకపోతే అతనికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ వచ్చింది. బుధవారం సాక్షి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ఉండగా.. ధోనీ అటుగా బైక్‌పై వచ్చి ఆమె పక్కనే ఉన్న జీవాని బైక్‌పై ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. ఇదంతా లైవ్ సెషన్‌లో కనిపించింది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది.

ధోనికి బైక్‌ రైడ్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాంచీ వీధుల్లో అర్దరాత్రులు తన స్నేహితులతో కలిసి తిరగడం ఎంతో ఇష్టమని మహీ గతంలో అనేకసార్లు తెలిపాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూపంలో లభించిన, ఇష్టపడి కొనుకున్న బైక్‌లతో మహీ తన ఫామ్ హౌస్‌లో ఓ గ్యారేజీని ఏర్పాటు చేసుకున్నాడు.
అంతేకాకుండా ఈ లాక్‌డౌన్‌లో తన పాత బైక్‌లకు ధోనినే స్వయంగ రిపేర్ చేశాడని సాక్షి తెలిపారు. చెడిపోయిన ఏడు బైక్‌ల‌కు కొత్త పార్ట్స్ తెచ్చి బాగు చేశాడని చెప్పుకొచ్చింది.

దళితుల పట్ల యువరాజ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లుదళితుల పట్ల యువరాజ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

ఇక ఇలా ఫామ్‌హౌస్‌లో జీవా, ధోనిలు బైక్‌పై చక్కర్లు కొట్టడం ఇదే తొలి సారి కాదు. గతంలో కూడా వీరిద్దరు బైక్‌పై తిరుగుతున్న వీడియోనో సాక్షి తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో ధోనీ పబ్‌జీకి దాసోహమయ్యాడని, నిద్రల్లో కూడా కలవరిస్తున్నాడని సాక్షి తెలిపింది. ఆ గేమ్ అతనికి వ్యసనంగా మారిందని చెప్పుకొచ్చింది.

ఇక గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్దమైనా కరోనా పుణ్యమా అది రద్దవ్వడంతో అతని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ధోనీ రిటైర్మెంట్‌పై ఊహగానాలు ఊపందుకున్నాయి. అతని వీడ్కోలుపై పుకార్లు కూడా వెలువడ్డాయి. సాక్షి కూడా సహనం కోల్పోయి వాటిని తిప్పి కొట్టింది.

Story first published: Wednesday, June 3, 2020, 10:26 [IST]
Other articles published on Jun 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X