న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సలామ్‌ క్రికెట్‌ 2019: సచిన్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులను పొగొట్టినవేళ!

When Sachin Tendulkars friend almost lost his World Cup man-of-the-match awards

హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్‌లో జరిగిన ఓ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. వరల్డ్‌కప్‌లో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు గెలవాలని ప్రతి ఒక్క క్రికెటర్‌కూ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఈ అవార్డు ఒక ప్రోత్సాహకం లాగా పనికొస్తుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంతేకాదు టోర్నీలో ఆడబోయే మిగతా మ్యాచులకు ఇది గొప్ప ఉత్సాహాన్నిస్తుంది. 2003లో జరిగిన వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 98 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యక్రమంలో

సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యక్రమంలో

ఈ మ్యాచ్ అనంతరం జరిగిన సంఘటనను వరల్డ్‌కప్-2019 నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యక్రమంలో సచిన్‌ అభిమానులతో పంచుకున్నాడు. పాక్‌పై గెలిచిన ఆనందంలో మ్యాచ్ అనంతరం జట్టులోని ఆటగాళ్లంతా సంబరాలు చేసుకోవాలని అనుకున్నారు.

రాత్రి 11 గంటల సమయంలో

రాత్రి 11 గంటల సమయంలో

మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో జట్టులోని ఆటగాళ్లంతా బయటకి వెళ్లారు. అయితే, బాగా పొద్దు పోవడంతో హోటల్‌గానీ, రెస్టారెంట్‌ గానీ తెరిచి లేవు. దీంతో నిరాశగా తిరిగి వారి హోటల్‌కు వెళ్తుండగా ఓ చైనీస్‌ హోటల్‌ కనిపించింది. అక్కడికెళ్లి అందరూ డిన్నర్‌ చేశారు. ఈ సందర్భంగా తన చేతిలో ఉన్న ఓ పార్సిల్‌ను సచిన్‌ తన స్నేహితుడికి పట్టుకోమని ఇచ్చాడు.

హోటల్ గదులకు చేరుకున్న తర్వాత

హోటల్ గదులకు చేరుకున్న తర్వాత

ఈ పార్సిల్ ఎంతో ముఖ్యమైందని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. చైనీస్‌ హోటల్‌‌లో డిన్నర్ ముగించుకుని తమ హోటల్ గదులకు చేరుకున్న తర్వాత తన స్నేహితుడిని పార్శిల్‌ ఇవ్వమని అడిగాడు. అతడు దానిని చైనీస్ హోటల్‌లోనే మరిచిపోయానని చెప్పాడు. వెంటనే ఆ హోటల్‌ నంబర్‌ సంపాదించి ఫోన్‌ చేయడంతో వారు ఆ పార్శిల్‌ను ఎట్టకేలకు సచిన్‌కు అప్పగించారు.

మూడు బంగారు వాచీలు

మూడు బంగారు వాచీలు

ఇంతకీ ఆ పార్శిల్‌ కవర్‌లో ఉన్నవి ఏంటంటే.. ఆ వరల్డ్‌కప్ మెగా టోర్నీలో సచిన్‌కు అప్పటివరకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు కింద వచ్చిన మూడు బంగారు వాచీలు. తాజాగా, ఈ సంఘటనను గుర్తు చేసుకున్న సచిన్.... ఎప్పటికీ దీనిని మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సచిన్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, June 3, 2019, 11:51 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X