న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు.. ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తారనుకోలేదు'

West Indies vs India, 2nd Test: West Indies batting disappointing says Floyd Reifer

కింగ్‌స్టన్: రెండో టెస్టులో మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు. సొంత గడ్డపై ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తారనుకోలేదు అని వెస్టిండీస్ కోచ్ ఫ్లాయిడ్ రీఫర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్‌తో సహా 6 వికెట్లు పడగొట్టిన విషయం తెల్సిందే. బుమ్రా దెబ్బకు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 87 పరుగులకు 7 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ ఇంకా 329 పరుగులు వెస్టిండీస్‌ వెనకబడి ఉంది.

హ్యాట్రిక్ ఘనత విరాట్ కోహ్లీదే: బుమ్రాహ్యాట్రిక్ ఘనత విరాట్ కోహ్లీదే: బుమ్రా

మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు:

మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు:

రెండో రోజు మ్యాచ్ అనంతరం ఫ్లాయిడ్ రీఫర్ మాట్లాడుతూ... 'మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు. ఇన్నింగ్స్ ఆరంభంలో మా బ్యాట్స్‌మెన్ ఎక్కువ బంతులను వదిలేయకపోయారు. బంతి కదులుతున్నప్పుడు వీలైనంత ఆలస్యంగా ఆడాలి. కానీ మా బ్యాట్స్‌మెన్ అలా చేయలేదు. సొంత గడ్డపై ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తారనుకోలేదు. జట్టులో ఉన్న లోపాలు సవరించుకొని మ్యాచ్ కొనసాగించాలి' అని పేరొన్నారు.

మాకు కఠినమైన రోజు:

మాకు కఠినమైన రోజు:

'ఈ రోజు మాకు కఠినమైన రోజు. మేము ప్రారంభించిన విధానాన్ని చూస్తే టీమిండియాను త్వరలోనే ఆలౌట్ చేస్తామనుకున్నాం. కానీ అలా జతగలేదు. మా బౌలర్లు చాలా మంచి లైన్ అండ్ లెంగ్త్ వేశారు. రోచ్, హోల్డర్, కార్న్‌వాల్ బాగా బౌలింగ్ చేశారు. ఓ దశలో 302/7 తో నిలిచిన సమయంలో మా బౌలర్లు సద్వినియోగం చేసుకోలేదు. విహారీ, ఇషాంత్ అద్భుతంగా పోరాడారు. హోల్డర్ 5 వికెట్లతో చెలరేగినప్పటికీ అప్పటికే ఆలస్యం అయింది. బుమ్రా అద్భుతమైన స్పెల్ వేశాడు. అతడిని అభినందించాల్సిందే' అని ఫ్లాయిడ్ అన్నారు.

బుమ్రా దెబ్బ:

బుమ్రా దెబ్బ:

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌కు బుమ్రా తన పేస్‌ రుచి చూపించాడు. ఏడో ఓవర్లోనే ఓపెనర్ క్యాంప్‌బెల్‌ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఇక తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. డారెన్‌ బ్రేవో(4), బ్రూక్స్‌(0), రోస్టన్‌ ఛేజ్‌(0)లను ఔట్ చేసాడు. బ్రాత్‌వైట్, కూడా బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో విండీస్‌ను హెట్‌మెయిర్‌ (34) ఆదుకున్నాడు. అయితే షమీ అతన్ని ఔట్ చేసాడు. మరోవైపు హోల్డర్ కూడా బుమ్రాకి చిక్కడంతో విండీస్‌ 87 పరుగులకు 7 వికెట్లను చేజార్చుకుంది.

Story first published: Sunday, September 1, 2019, 17:21 [IST]
Other articles published on Sep 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X