న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమ్ బస్సులో రిపోర్టర్‌గా మారిపోయిన చాహల్ (వీడియో)

WATCH: Yuzvendra Chahal turns reporter for Team India after Windies series win

హైదరాబాద్: టీమిండియా చైనామన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ రిపోర్టర్‌గా మారాడు. సరదాగా టీమ్ బస్సులో రిపోర్టర్‌గా మారిపోయాడు. మూడు టీ20ల సిరిస్‌లో చెన్నై వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి టీ20 గత ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే.

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో పర్యాటక వెస్టిండిస్ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తుండగా సహచర ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌లను చాహల్ ఇంటర్వ్యూ చేశాడు.

కదులుతున్న బస్సులోనే సరదాగా ఇంటర్యూ

చెన్నైలో కదులుతున్న బస్సులోనే కలియతిరుగుతూ మైక్రోఫోన్ సాయంతో వారిని తనదైన శైలిలో చాహల్ ప్రశ్నించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో క్రికెటర్ల అనుభవాలను, అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ఇంటర్యూ చేసే సమయంలో చాహల్ ఫిజియో తలపై ముద్దిచ్చాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన విండిస్

20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన విండిస్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్‌మెన్లలో నికొలస్‌ పూరన్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, డారెన్‌ బ్రేవో (37 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించాడు.

మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం

మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం

అనంతరం శిఖర్ ధావన్ (92), రిషబ్ పంత్ (58) దూకుడుగా ఆడటంతో 182 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్‌కు ఇదే అత్యధిక స్కోరు కాగా, పంత్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Tuesday, November 13, 2018, 19:05 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X