న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంటి ఆవరణలో పెంపుడు శునకాలతో ధోని క్యాచ్‌ ప్రాక్టీస్ (వీడియో)

By Nageshwara Rao
MS Dhoni's Adorable Practice Session With his Dogs
Watch: MS Dhonis adorable practice session with his dogs will leave you in awe

హైదరాబాద్: క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై తాజాగా భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతుండగా.. వన్డేలు, టీ20లు ముగిసిన ధోని తర్వాత స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే.

మూడు రోజుల క్రితం తన కూతురు జీవాతో కలిసి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్న ధోని, తాజాగా తన పెంపుడు శునకాలతో కలిసి గార్డెన్‌లో సరదాగా క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని అభిమానుల కోసం పోస్టు చేశాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో కూడా శునకాలకి క్యాచ్‌ పట్టడంపై శిక్షణ ఇస్తున్న వీడియోని ధోని పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

రెండో రోజుల క్రితం తన గారాల పట్టి జీవాతో కలిసి ఆడుకుంటున్న వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో జీవా ఎంచక్కా ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ధోని భార్య సాక్షి కలగజేసుకుని "జీవా.. నాన్న మంచోడా చెడ్డోడా? అని అడగ్గా.. మంచోడు(గుడ్‌) అని బదులిచ్చింది. ఆ తర్వాత మీరందరూ మంచివారు. మీ అందరూ" అని జీవా బదులిచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు ఈ వీడియోకి "వెరీ స్మార్ట్‌" అని టైటిల్ పెట్టాడు. టెస్టు ఫార్మాట్‌ నుంచి 2014, డిసెంబరులో తప్పుకున్న ధోని ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.

భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత.. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌లో ఆడనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ కోసం వచ్చే నెల రెండో వారంలో టీమిండియా బయల్దేరనుంది. అప్పటి వరకు ధోని విశ్రాంతి తీసుకోనున్నాడు.

Very smart

A post shared by M S Dhoni (@mahi7781) on

Story first published: Friday, August 24, 2018, 19:13 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X