న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖలో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మకు అవమానం (వీడియో)

India VS Australia T20 : Rohit Sharma Ignored By Virat Kohli And Jasprit Bumrah | Oneindia Telugu
Virat Kohli, Jasprit Bumrah Ignore Rohit Sharma During 1st T20I Against Australia - Watch

హైదరాబాద్: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రా... వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించారంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.

<strong>బ్యాటింగ్‌లో వైఫల్యం: విశాఖ టీ20లో భారత్ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ</strong>బ్యాటింగ్‌లో వైఫల్యం: విశాఖ టీ20లో భారత్ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ

ఇంతకీ వీడియోలో ఏముందంటే!

19వ ఓవర్ వేసిన బుమ్రా

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ వేసేందుకు బంతిని బుమ్రా అందుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రోహిత్ శర్మ... బుమ్రాతో మాట్లాడటానికి వెళ్లాడు. అతనికి ఏవో సూచనలు ఇస్తున్న సమయంలో కెప్టెన్ కోహ్లీ కూడా అక్కడికి వచ్చి తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం కోహ్లీ చెప్పింది విని బౌలింగ్ చేసేందుకు బుమ్రా సిద్దమయ్యాడు. కాసేపు రోహిత్ శర్మ అలాగే నిల్చొని ఆ తర్వాత కాస్త నిట్టూర్పుతో అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మనం వీడియోలో చూడొచ్చు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్న అభిమానులు అవును.. ఈ ఇద్దరూ రోహిత్‌ను అవమానించారని ట్వీట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ మాత్రం ఇందులో అవ‌మానించ‌డం ఏముంది? కెప్టెన్ ఫీల్డింగ్ సెట్ చేస్తుంటే.. రోహిత్ ప‌క్క‌నుండి చూస్తున్నాడు అని ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చివరి బంతికి విజయాన్ని అందుకున్న ఆసీస్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి బంతికి విజయాన్ని అందుకుంది. భారత బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్‌ (50) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (29 నాటౌట్‌), కోహ్లి (24) ఫర్వాలేదనిపించారు.

రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించిన రాహుల్, కోహ్లీ

రాహుల్, కోహ్లి కలిసి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 55 పరుగులు జోడించారు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ(5) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోవైపు బుమ్రా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసి మూడు వికెట్లు తీసి 16 పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Monday, February 25, 2019, 16:38 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X