న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువ పేసర్లు జట్టుకు అవసరం.. సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసుకోవాలి: కోహ్లీ

Virat Kohli indicates mini transition of pace unit in near future

హైదరాబాద్: సీనియర్లకు తోడుగా జట్టులో యువకులు ఎవరూ లేరు. వీరి స్థానాలను భర్తీచేయగల సామర్థ్యమున్న యువ పేసర్లు జట్టుకు అవసరం. వారిని సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలి అని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. యువ పేసర్లపై టీమిండియా యాజమాన్యం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా బంతులు విసిరే ముగ్గురు నలుగురు కుర్రాళ్లెవరో గుర్తించాలన్నారు.

IPL 2020: ఐపీఎల్‌కు కరోనా ముప్పు లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే లీగ్‌!!IPL 2020: ఐపీఎల్‌కు కరోనా ముప్పు లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే లీగ్‌!!

'ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌ లాంటి వారు మరెంతోకాలం సేవలందించకపోవచ్చు. సీనియర్లకు తోడుగా యువకులు ఎవరూ లేరు. సీనియర్ల స్థానాలను భర్తీచేయగల యువ పేసర్లు జట్టుకు అవసరం. వారిని సాధ్యమైనంత త్వరగా మేం సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా బంతులు విసిరే ముగ్గురు నలుగురు కుర్రాళ్లెవరో గుర్తించాలి. ఎందుకంటే సీనియర్ల లోటు కనబడడకూడదు' అని కోహ్లీ అన్నారు.

'క్రికెట్ ఆటలో నిత్యం పరివర్తన జరుగుతూనే ఉంటుంది. అందరికీ దానిపై అవగాహన ఉండాలి. ఆటగాళ్లు వస్తారు, వెళుతారు. మనం ఒక్కరిపైనే ఆధారపడలేం. వారు ఆటను ముగించాక బ్యాకప్‌ ఉండరు. నవదీప్ సైనీ ఇప్పటికే మా ప్రణాలికల్లో ఉన్నాడు. మరో ఇద్దరు ముగ్గురిపై దృష్టి పెట్టాం. రెండేళ్లుగా మాకు విజయాలను అందించిందే పేస్‌ విభాగం. అందుకే మేం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాణాలు దిగజారకుండా చూసుకోవాలి' అని కోహ్లీ పేర్కొన్నారు.

'26 ఏళ్ల వయసున్న జస్ప్రీత్ బుమ్రా పేస్‌ దళాన్ని చాలాఏళ్లు ముందుకు నడిపించగలడు. ఉమేశ్‌, ఇషాంత్‌, షమీ ఏళ్లుగా సేవలందించారు. వారి స్థానాలను భర్తీచేసే కుర్రాళ్లను వెతకాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇషాంత్‌ (32), ఉమేశ్‌ (33) ఇప్పటికే 30 ఏళ్లు దాటారు. వీరు మరెంతో కాలం సేవలు అందించకపోవచ్చు. నవదీప్ సైనీ, దీపక్ చహర్ ఇప్పటికే టీమిండియాకు ఆడుతున్నారు. మహ్మద్‌ సిరాజ్‌, సందీప్‌ వారియర్‌, అవేశ్‌ ఖాన్‌, ఇషాన్‌ పోరెల్‌లపై కూడా బీసీసీఐ అధికారులు దృష్టి సారించారని సమాచారం.

Story first published: Wednesday, March 4, 2020, 11:43 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X