న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli T20I Captaincy: 'అలా జరిగితే.. ప్రతి ఒక్కరూ తిట్టిపోస్తారు! విరాట్ కోహ్లీ తప్పుకోవడం సరైన నిర్ణయమ

Virat Kohli Decision is Right: Brad Hogg reacts on Indian Captain T20I Captaincy

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడం సరైన నిర్ణయమే అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ సారథ్యం వహిస్తున్నందున అతనిపై పనిభారం పెరిగిందన్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే.. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రాణించడం తేలికవుతుందని బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. యూఏఈలో జ‌రిగే టీ20 ప్రపంచకప్‌ త‌ర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్న‌ట్లు విరాట్ కోహ్లీ గురువారం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మాజీలు కోహ్లీ కెప్టెన్సీపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు.

కోహ్లీనే స్వయంగా:

కోహ్లీనే స్వయంగా:

యూఏఈలో జ‌రిగే టీ20 ప్రపంచకప్‌ 2021త‌ర్వాత టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలుగుతున్న‌ట్లు సోమవారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ త‌ప్పుకుంటాడ‌ని వ‌చ్చిన వార్త‌ల‌న్నీ ఊహాగానాలేన‌ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులు కొట్టి పారేశారు. కార్యదర్శి జై షా అయితే నిజంగానా అంటూ సెటైర్లు వేశాడు. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే టీ20 సార‌ధ్యం నుంచి తాను వైదొలుగుతున్న‌ట్లు విరాట్ కోహ్లీనే స్వయంగా ప్ర‌క‌టించ‌డం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

 ఆ నిర్ణయం సరైందే:

ఆ నిర్ణయం సరైందే:

తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై స్పందించాడు. ' విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని నేను భావిస్తున్నా. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఒకవేళ అతడు బాగా ఆడితే.. అంతా సవ్యంగా సాగుతుంది. అదే విఫలమైతే.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు. ప్రతి ఒక్కరూ అతడిని తిట్టిపోస్తారు. అతడు ఒత్తిడిని తట్టుకొని ఆడుతున్నాడు. అయితే చివరిసారి ప్రపంచకప్‌కు నాయకత్వం వహించి కోహ్లీ జట్టు విజయం సాధించి కప్పు అందుకునే ఒక అవకాశం ఉన్నందున సంతోషంగా ఉంది' అని బ్రాడ్‌ హాగ్‌ పేర్కొన్నాడు.

బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు:

బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు:

'విరాట్ కోహ్లీ గత కొట్నా కాలంగా భారీ ఇన్నింగ్స్ ఆడడం లేదు. నిజం చెప్పాలంటే గత ఐదు సిరీస్‌ల్లో రాణించలేకపోయాడు. ఈ విషయాన్ని అతడు కూడా అర్థం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడంకు బదులుగా.. రెండిలో సారథ్యం కాస్త బెటరే. కాస్త ఉపశమనంగా ఉంటుంది. కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు' ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక భారత జట్టు ఇంగ్లండ్‌లో ఐదో టెస్టు ఆడకపోవడంపై అందరూ విమర్శిస్తున్నారని, అయినా టీమిండియా సరైన నిర్ణయమే తీసుకుందని మద్దతిచ్చాడు. భారత జట్టు టెస్టు క్రికెట్‌కు విలువ ఇస్తున్నందునే ఈ ఫార్మాట్‌లో ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని బ్రాడ్‌ హాగ్‌ చెప్పుకొచ్చాడు.

 అతడిని వైస్‌ కెప్టెన్‌ను చేయొచ్చు:

అతడిని వైస్‌ కెప్టెన్‌ను చేయొచ్చు:

కేల్‌ రాహుల్‌లో నాయకత్వ లక్షణాలున్నాయని, భవిష్యత్తు కెప్టెన్‌గా అతణ్ని ప్రోత్సహించాలని భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'బీసీసీఐ భవిష్యత్తుపై దృష్టిపెట్టడం మంచి విషయం. భారత్‌ ఓ కొత్త కెప్టెన్‌ను తయారు చేయాలనుకుంటే లోకేష్ రాహుల్‌పై దృష్టి పెడితే మంచిది. ఇంగ్లండ్‌లో చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతణ్ని మొదటగా వైస్‌ కెప్టెన్‌ను చేయొచ్చు. రాహుల్‌ ఐపీఎల్‌లో తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్‌ దెబ్బతినకుండా చూసుకున్నాడు' అని సన్నీ అన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు రాహుల్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, September 18, 2021, 9:07 [IST]
Other articles published on Sep 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X