న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేలవంగా కెరీర్‌ను ఆరంభించి అందనంత ఎత్తులో కోహ్లీ

Virat Kohli birthday: A legend in making, Indian captain didnt have best of debuts across formats - Stats

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో టాప్ బ్యాట్స్‌మెన్‌లో తానొక్కడై నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆటతీరు.. అనుసరించే లైఫ్ స్టైల్ అంతా ప్రత్యేకంగా కనిపించే కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు లేకపోలేదు. కెరీర్ ఆరంభం నుంచి కంటే ఇటీవలి కాలంలోనే దూకుడు మీద సాగిపోతున్నాడు విరాట్. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ .. కొద్ది రోజుల ముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పది వేల క్లబ్‌లోనూ చేరిపోయాడు.

నవంబరు 5 2018 నాటికి 30ఏళ్లకు చేరుకున్నాడు కోహ్లీ.అతని ఐపీఎల్ కెరీర్ .. రంజీ ట్రోఫీ కెరీర్.. ఫార్మాట్ ఏదైనా ఆరంభంలో అంతగా రాణించలేకపోయాడు. కుదురుకోవడానికి ఎంతో సమయం తీసుకేలేదు. చాలా త్వరగా నేర్చుకున్న కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కెరీర్‌లో ముఖ్య ఘట్టాలు ఒక సారి చర్చించుకుందాం.

ఫస్ట్ క్లాస్ క్రికెట్(రంజీ ట్రోఫీ):

ఫస్ట్ క్లాస్ క్రికెట్(రంజీ ట్రోఫీ):

18 ఫిబ్రవరి 2006న విరాట్ కోహ్లీ తన రంజీ ట్రోఫీ కెరీర్‌ను ఆరంభించాడు. అరంగ్రేట మ్యాచ్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన కోహ్లీ తమిళనాడు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. ఇందులో 25బంతులాడిన కోహ్లీ కేవలం 10పరుగులు మాత్రమే చేయగలిగాడు. డ్రా గా ముగిసిన మ్యాచ్‌లో కోహ్లీని యో మహేశ్ అవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు.

ఐపీఎల్ 2019: ముంబై, పంజాబ్ జట్లలో ప్రధాన మార్పులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్:

ఇండియన్ ప్రీమియర్ లీగ్:

అండర్ 19 వరల్డ్ కప్ ఆడుతున్నప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ అదే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ అరంగ్రేట్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిగా 2008 ఏప్రిల్ 16న బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేయగా ఆశోక్ దిండా అవుట్ చేశాడు. కానీ, అరంగ్రేట సీజన్‍‌లో 13 మ్యాచ్‌లు ఆడి 165పరుగులు తీశాడు.

టీ20ల్లోకి అరంగ్రేటం:

టీ20ల్లోకి అరంగ్రేటం:

2010 జూన్ 12న జింబాబ్వే ప్రత్యర్థిగా విరాట్ కోహ్లీ టీ20ల్లోకి అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతులాడి 26పరుగులు చేశాడు. 113పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

వన్డేల్లోకి అరంగ్రేటం:

వన్డేల్లోకి అరంగ్రేటం:

శ్రీలంక ప్రత్యర్థిగా 2008 ఆగష్టు 18న వన్డేల్లోకి అరంగ్రేటం చేసిన కోహ్లీ.. తొలి మ్యాచ్‌లో 22 బంతులకి 12పరుగులు చేశాడు. నువాన్ కులసేకరాకు వికెట్ అప్పగించి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో లంక ఎనిమిది వికెట్ల తేడాతో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే 146పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది.

టెస్టుల్లోకి అరంగ్రేటం:

టెస్టుల్లోకి అరంగ్రేటం:

అన్ని ఫార్మాట్ల మాదిరే కోహ్లీ టెస్టు ఫార్మాట్‌లోనూ శుభారంభాన్ని నమోదు చేయలేకపోయాడు. 2011 జూనె 20న తొలి టెస్టు అరంగ్రేటంలో వెస్టిండీస్‌తో తలపడిన కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 4(10)చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 15(54) చేసి సరిపెట్టుకున్నాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఫిడెల్ ఎడ్వర్డ్స్ చేతుల మీదుగానే తన వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.

Story first published: Monday, November 5, 2018, 11:34 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X