Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: ముంబై, పంజాబ్ జట్లలో ప్రధాన మార్పులు

IPL 2019: Zaheer Khan to replace Lasith Malinga as Mumbai Indians bowling mentor?

హైదరాబాద్: రాబోయే ఐపీఎల్ సీజన్‌కు అన్ని జట్ల మాదిరిగానే ముంబై ఇండియన్స్ కూడా మార్పులు చేపట్టింది. ముంబై జట్టు బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి నుంచి శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. దాంతో పాటుగా గతేడాది ఐపీఎల్ నుంచి బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఆసియా కప్‌లో ఆడిన మలింగ..

ఆసియా కప్‌లో ఆడిన మలింగ..

గతేడాది ముగిసిన వేలంలో మలింగను ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో అతను ముంబై బౌలింగ్ కోచ్‌గా కొనసాగాడు. తాజాగా ఆసియా కప్‌లో ఆడిన మలింగ..ఈ సీజన్ వేలంలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తుండడంతో అతని స్థానంలో జహీర్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.

కోచ్‌గా మాత్రం అతనికిదే మొదటిసారి

కోచ్‌గా మాత్రం అతనికిదే మొదటిసారి

ఐపీఎల్‌లో జహీర్ ముంబై జట్టుతోపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరఫున ఆటగాడిగా సేవలందించగా.. కోచ్‌గా మాత్రం అతనికిదే మొదటిసారి కానుంది. గత సీజన్‌లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా, మెంటార్‌గా జహీర్ వ్యవహరించాడు.

పంజాబ్ నుంచి తప్పుకున్న సెహ్వాగ్:

పంజాబ్ నుంచి తప్పుకున్న సెహ్వాగ్:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వచ్చే సీజన్‌లో తాను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా వ్యవహరించడం లేదని వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రకటించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతో తెగదెంపులు చేసుకున్నట్లు శనివారం తెలిపాడు. 2014, 2015లలో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు తరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ తర్వాత మూడు సీజన్‌లుగా మెంటార్‌ పాత్ర పోషించాడు. ఇటీవలే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ న్యూజిలాండ్‌ జాతీయ జట్టు మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించింది.

Story first published: Monday, November 5, 2018, 10:35 [IST]
Other articles published on Nov 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+