న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్‌కు ఖవాజా!

Usman Khawaja gets Indian Visa for Border-Gavaskar Trophy

ఆస్ట్రేలియన్ క్రికెట్ ఉస్మాన్ ఖవాజాకు ఎట్టకేలకు భారత వీసా దక్కింది. కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం అతను భారత్‌కు రావలసి ఉంది. అయితే ఇండియన్ హైకమిషన్ నుంచి వీసా, పాస్‌పోర్టు రావకపోవడంతో అతను భారత్‌కు రావడం ఆలస్యమైంది. ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్, సహాయక సిబ్బంది, మిగతా జట్టు సభ్యులు అందరూ కూడా మెల్‌బోర్న్ నుంచి బెంగళూరుకు బయలు దేరారు. వీళ్లు రెండు విమానాల్లో వెళ్లగా.. ఖవాజా మాత్రం వీసా లేకపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది.

సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేషన్..

సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేషన్..

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఖవాజా తన ఫ్రస్ట్రేషన్‌ను వెళ్లగక్కాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లందరి వీసాల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జనవరిలోనే భారత కమిషన్‌ను సంప్రదించింది. ఆటగాళ్ల పాస్‌పోర్టులను కూడా అందించింది. అయితే పాకిస్తాన్‌లో పుట్టిన ఖవాజా విషయాన్ని మాత్రమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పిన భారత హైకమిషన్.. అతని వీసాను ఆలస్యం చేసినట్లు సమాచారం. ఖవాజా గతంలో ఐపీఎల్‌లో కూడా ఆడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున 56 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడీ 36 ఏళ్ల క్రికెటర్.

ఎట్టకేలకు దక్కిన వీసా..

ఎట్టకేలకు దక్కిన వీసా..

బుధవారం ఆలస్యంగా అతనికి వీసా, పాస్‌పోర్టు లభించినట్లు సమాచారం. దీంతో అతను గురువారం నాడు మెల్‌బోర్న్ నుంచి బెంగళూరు చేరుకునేలా సీఏ ఏర్పాట్లు చేసిందట. ఇక్కడకు చేరుకున్న తర్వాత శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా జట్టు పాల్గొనే ప్రాక్టీస్ సెషన్స్‌లో ఖవాజా పాల్గొంటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఈ రెండు జట్లకు చాలా కీలకమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆస్ట్రేలియా ప్రయత్నిస్తుంటే.. భారత్ కూడా ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ నెగ్గక తప్పదు.

ప్రాక్టీస్ సెషన్స్..

ప్రాక్టీస్ సెషన్స్..

ఈ సిరీస్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ససేమిరా అన్నది. గతంలో భారత్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ పిచ్, అసలు సిరీస్‌లో పిచ్‌లు చాలా భిన్నంగా ఉన్నాయని, అందుకే తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని అనుకోవడం లేదని ఆసీస్ జట్టు పేర్కొంది. నాలుగు రోజుల పాటు బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆ జట్టు తొలి టెస్టు కోసం నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఇక్కడే భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడతాయి.

Story first published: Thursday, February 2, 2023, 12:57 [IST]
Other articles published on Feb 2, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X