న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!

These top T20 players are not good in ODI format

టీ20 క్రికెట్‌లో ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అంత ఒత్తిడిలో రాణించే ఆటగాళ్లకు మిగతా ఫార్మాట్లు ఇంకా ఈజీ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొంతమంది ప్లేయర్లు టీ20 ఫార్మాట్లో టాప్ ఆటగాళ్లుగా ఉన్నారు. కానీ వన్డేల్లో మాత్రం చేతులెత్తేస్తున్నారు. వాళ్ల రికార్డు వన్డేల్లో చూస్తే.. వీళ్లకు జట్టులో చోటు ఎలా దక్కిందని ఆశ్చర్యపోతాం. ఆ ఆటగాళ్లు ఎవరంటే..

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

టీ20 ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ వన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. అతను పొట్టి ఫార్మాట్లో ఎంత విధ్వంసకర ఆటగాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియం నలువైపులా ఎక్కడికైనా భారీ షాట్లు ఆడటం అతనికి అలవాటు. కానీ వన్డేల్లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 18 ఇన్నింగ్సులు ఆడిన అతను 28.86 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. టీ20ల్లో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన అతను.. వన్డేల్లో మాత్రం మూడంకెల స్కోరు ఒక్కసారి కూడా చెయ్యలేకపోయాడు.

వానిందు హసరంగ

వానిందు హసరంగ

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగ. పొట్టి ఫార్మాట్లో ఆ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడీ స్పిన్నర్. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా టాప్ వికెట్ టేకర్ అతనే. ఇప్పటి వరకు అతను మొత్తం 55 టీ20 మ్యాచులు ఆడాడు. వీటిలో 89 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అడపా దడపా బ్యాటుతో కూడా రాణించాడు. కానీ వన్డేల్లో మాత్రం అతను ఏమాత్రం ఆకట్టుకోలేదు. తన కెరీర్‌లో 37 వన్డే మ్యాచులు ఆడిన అతను కేవలం 39 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటర్‌గా కూడా రాణించలేదు. భారత్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఆకట్టుకోలేకపోయాడు.

మొయీన్ అలీ

మొయీన్ అలీ

టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ ఆల్‌రౌండర్‌లలో మొయీన్ అలీ ఒకడు. ప్రస్తుతం టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడీ ఇంగ్లండ్ ప్లేయర్. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా అతను సభ్యుడే. టీ20ల్లో అతని స్ట్రైక్ రేటు 145.81 కాగా.. ఓ మోస్తరు ఎకానమీతో 40 వికెట్లు కూడా తీసుకున్నాడు. అదే వన్డేల్లో చూస్తే అతని రికార్డు చాలా చెత్తగా ఉంది. ఈ ఫార్మాట్లో అతని సగటు కేవలం 25.15 మాత్రమే. అంతేకాదు 99 ఇన్నింగ్సుల్లో కేవలం 9 సార్లు మాత్రమే 50పైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ ఫార్మాట్లో చాలా అరుదుగానే వికెట్లు తీసుకుంటాడు.

Story first published: Tuesday, January 31, 2023, 18:33 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X